Mohammed Shami: ఫ్లాట్ పిచ్‍పై షమీ అద్భుతమైన ఇన్‍స్వింగర్.. అవాక్కైన స్మిత్: వీడియో
Mohammed Shami: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఓ అద్భుతమైన బంతి వేశాడు. ఈ బంతికి స్మిత్ బౌల్డ్ అయ్యాడు.
Mohammed Shami: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మరోసారి అదరగొట్టాడు. మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు (సెప్టెంబర్ 22) మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో తొలుత బౌలింగ్ చేసింది భారత్. పిచ్ ఫ్లాట్‍గా ఉన్నా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కొన్ని అద్భుతమైన బంతులు వేశాడు. పిచ్ పేస్‍కు అంతగా సహకరించకున్నా.. స్వింగ్‍ను రాబట్టాడు.
తొలి ఓవర్ వేసిన మహమ్మద్ షమీ.. నాలుగో బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్(4)ను ఔట్ చేశాడు. షమీ ఔట్ స్వింగర్ వేయగా.. బంతి మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తగిలి ఫస్ట్ స్లిప్‍లో ఉన్న శుభ్‍మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో మార్ష్ ఔటయ్యాడు. భారత్‍కు శుభారంభం దక్కింది. అయితే, నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్(41)ను షమీ 22వ ఓవర్లో బౌల్డ్ చేశాడు. అది కూడా భారీ ఇన్‍స్వింగర్ వేసి వికెట్‍ను పడగొట్టాడు. వివరాలివే..
22వ ఓవర్ మూడో బంతి(21.3)ని షమీ ఇన్‍స్వింగర్ వేయగా.. బంతి చాలా లోపలికి వచ్చింది. స్మిత్ కవర్ డ్రైవ్‍కు ప్రయత్నించగా.. లోపలికి భారీగా స్వింగ్ అయిన బాల్.. బ్యాట్ ఇన్‍సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తగిలింది. ఫ్లాట్ పిచ్‍పై మహమ్మద్ షమీ.. బంతిని ఇంత స్వింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. బౌల్డ్ అయ్యాక స్మిత్ కూడా అవాక్కయ్యాడు. అలా చూసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ పిచ్‍పై బంతిని అంతలోపలికి ఎలా షమీ స్వింగ్ చేశాడో అర్థం కాలేదని ఆ సమయంలో కామెంటేటర్ కూడా అన్నారు. ఏదైనా చిన్న క్రాక్‍కు తగిలి వెళ్లిందా అని ఆశ్చర్యపోయారు. మొత్తంగా షమీ వేసిన అద్భుత బంతికి సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది.
మరోవైపు, మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‍కు ఓసారి వర్షం కూడా అంతరాయం కలిగించింది. అయితే, మళ్లీ మొదలైంది. ఆస్ట్రేలియాతో ఈ సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్‍కు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తున్నాడు. మూడో వన్డేకు రోహిత్, కోహ్లీ, హార్దిక్ తిరిగి జట్టులోకి రానున్నారు.