IND vs AUS 5th Test: ఐదో టెస్ట్ కోసం రెండు మార్పులు చేసిన టీమిండియా - ఆరంభంలోనే షాక్ - రాహుల్ విఫలం!
IND vs AUS 5th Test: సిడ్నీ వేదికగా మొదలైన ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ చివరి టెస్ట్ నుంచి రోహిత్ శర్మను తప్పించారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఆకాష్ దీప్‌ను పక్కనపెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇచ్చింది.
IND vs AUS 5th Test: అనుకున్నదే జరిగింది. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదో టెస్ట్ కోసం రోహిత్ శర్మను పక్కనపెట్టేశారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. రోహిత్ శర్మతో పాటు ఆకాష్‌దీప్‌ను కూడా తప్పించారు. ఆకాష్ దీప్ ప్లేస్‌ను ప్రసిద్ధ్ కృష్ణతో రీప్లేస్ చేశారు. రెండు మార్పులతో ఐదు టెస్ట్‌లో టీమిండియా బరిలోకి దిగింది.
తొలుత బ్యాటింగ్...
సిడ్నీ వేదికగా మొదలైన ఈ ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. రోహిత్ శర్మను పక్కనపెట్టడంతో భారత ఇన్నింగ్స్‌ను యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఆరంభించాడు. పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ ఐదో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం పంత్‌నే కొనసాగించింది. రోహిత్ శర్మ తప్పుకోవడంతో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బుమ్రా నాయకత్వంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది.
రోహిత్ శర్మ ను తప్పించారా? తప్పుకున్నాడా?
ఫామ్ లేమిని సాకుగా చూపించి రోహిత్ శర్మను తప్పించారంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. దిగ్గజ ఆటగాడిని అవమానించారంటూ ట్వీట్లు, కామెంట్లు పెడుతోన్నారు. అయితే రోహిత్ శర్మనే స్వయంగా ఈ మ్యాచ్ ఆడనంటూ కోచ్‌కు చెప్పి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిడ్నీ టెస్ట్ అతడి కెరీర్‌లో చివరిదంటూ, ఏ క్షణమైన అతడు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటోన్నారు.
మిచెల్ మార్ష్ స్థానంలో...
ఐదోటెస్ట్ కోసం తుది జట్టులో ఆస్ట్రేలియా కూడా ఓ మార్పు చేసింది. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన మిచెల్ మార్ష్ ఐదో టెస్ట్‌లో స్థానం కోల్పోయాడు. మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్ జట్టులోకి వచ్చాడు.
రాహుల్ విఫలం...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా బరిలో దిగిన కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ కొన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. జట్టు స్కోరు 11 పరుగులు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జైస్వాల్ (8 పరుగులు)తో పాటు గిల్ క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి టీమిండియా 12 పరుగులు చేసింది.