Bumrah vs Konstas: బుమ్రాతో పెట్టుకున్నాడు.. బుక్ చేసేశాడు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ఎక్స్‌ట్రాలకు బూమ్ బూమ్ రిప్లై
Bumrah vs Konstas: బుమ్రాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆస్ట్రేలియాకు బాగానే తెలిసి వచ్చింది. ఆ టీమ్ యువ బ్యాటర్ చేస్తున్న ఎక్స్‌ట్రాలు హద్దు మీరుతున్నాయి. బుమ్రాను కూడా అతడు కవ్వించాడు. మరుసటి బంతికే ఖవాజా వికెట్ తీసి కోన్‌స్టాస్ పైకి దూసుకెళ్లాడతడు.
Bumrah vs Konstas: ఆస్ట్రేలియా జట్టులోకి మెల్‌బోర్న్ టెస్టుతోనే వచ్చిన 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కోన్‌స్టాస్ ఎక్స్‌ట్రాలు మితిమీరుతున్నాయి. టీమిండియాలో ప్రతి ఒక్కరితోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మొదట కోహ్లి, జడేజాలాంటి వాళ్లతో పెట్టుకున్న అతడు.. సిడ్నీ టెస్టు మొదటి రోజు చివర్లో బుమ్రాను కవ్వించాడు. దాని ఫలితం ఎలా ఉంటుందో తర్వాతి బంతిలోనే అతనికి తెలిసొచ్చింది. ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా.. కోన్‌స్టాస్ ముఖంలోకి చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బుమ్రా వర్సెస్ కోన్‌స్టాస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆట రసవత్తరంగా సాగింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సందర్భంగా చివరి ఓవర్ చివరి బంతికి ముందు హైడ్రామా జరిగింది. టీమిండియా స్టాండిన్ కెప్టెన్ బుమ్రాను కవ్వించే ప్రయత్నం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కోన్‌స్టాస్.
బౌలింగ్ చేయడానికి వెళ్లిన బుమ్రా తన రనప్ మొదలు పెట్టే సమయంలో అతన్ని ఏదో అన్నాడు. దీంతో ఎప్పుడూ లేని విధంగా బుమ్రా కూడా ఆగ్రహంతో అతని వైపు దూసుకొచ్చాడు. వికెట్లు పడటం లేదా అని బుమ్రాను కోన్‌స్టాస్ అనగా.. వెయిట్ అండ్ సీ అంటూ బదులిచ్చాడు.
మరుసటి బంతికే ఖవాజాను ఔట్ చేశాడు. స్లిప్ లో ఆ క్యాచ్ పట్టుకున్న రాహుల్, కోహ్లి సహా టీమ్ అంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుండగా.. బుమ్రా మాత్రం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కోన్‌స్టాస్ వైపు కోపంగా చూస్తూ దూసుకెళ్లాడు. బుమ్రాతోపాటు టీమ్ లోని అందరూ అతన్ని గుర్రుగా చూశారు. దీనికి సమాధానం చెప్పలేక కోన్‌స్టాస్ తలదించుకొని వెళ్లిపోయాడు. తొలి రోజు చివరి బంతికి ముందు బుమ్రాను రెచ్చగొట్టి తప్పు చేశానన్న భావం అతనిలో కనిపించింది. తొలి రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 9 రన్స్ చేసింది.
కోన్‌స్టాస్‌కు క్లాస్ పీకిన అభిమానులు
మెల్‌బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టుతోనే 19 ఏళ్ల కోన్‌స్టాస్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లోనే బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్స్ లు కొట్టడంతోపాటు హాఫ్ సెంచరీ చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ గా మారి.. టీమిండియా ప్లేయర్స్ ను చీటికిమాటికి కవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కోన్‌స్టాస్ ను క్లీన్ బౌల్డ్ చేసి అప్పుడే బుమ్రా అతనికి గట్టి సమాధానమిచ్చాడు. అయినా అతని బుద్ధి మారలేదు.
సిడ్నీలోనూ అలాగే నోటికి పనిచెబుతూ రెచ్చిపోతున్నాడు. ఎప్పుడూ కూల్ గా కనిపించే బుమ్రా కూడా అతన్ని చూసి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అటు నెటిజన్లు కూడా కోన్‌స్టాస్ కు క్లాస్ పీకుతున్నారు. ఎవరైనా వీడికి కాస్త చెప్పండ్రా అన్నట్లుగా ఎక్స్ అకౌంట్లో కోన్‌స్టాస్ తో ఆడుకుంటున్నారు. అతనికి బుమ్రా అసలైన సినిమా చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే అతడు ఎవరూ ఇష్టపడని ప్లేయర్ గా మిగిలిపోతాడని మరొకరు అన్నారు. బుమ్రా రివేంజ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.