India vs Australia 3rd ODI: దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు భారీ టార్గెట్.. కొట్టడం కష్టమేనా?
India vs Australia 3rd ODI: దంచికొట్టింది ఆస్ట్రేలియా. టీమిండియా ముందు భారీ టార్గెట్ విధించింది. టాప్ 4 బ్యాటర్లందరూ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది.
India vs Australia 3rd ODI: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగిపోయారు. రెండో వన్డేలో ఇండియా బ్యాటర్లు కొట్టిన భారీ స్కోరుకు ప్రతీకారం తీర్చుకున్నారు. రాజ్‌కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 7 వికెట్లకు 352 రన్స్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లతోపాటు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఆస్ట్రేలియా బ్యాటర్ల దెబ్బకు టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అతడు మూడు వికెట్లు కూడా తీయడం విశేషం. ఓపెనర్ మిచెల్ మార్ష్ 84 బంతుల్లోనే 96 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక స్మిత్ 73, లబుషేన్ 72, వార్నర్ 56 పరుగులు చేశారు.
మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇండియా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. 8 ఓవర్లలోనే తొలి వికెట్లకు 78 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన స్మిత్ కూడా ఎదురుదాడికి దిగడంతో ఆస్ట్రేలియా సులువుగా పరుగులు చేస్తూ వెళ్లింది. రెండో వికెట్ కు మార్ష్, స్మిత్.. 137 రన్స్ జోడించారు.
వాషింగ్టన్ సుందర్ మినహాయించి.. టీమిండియాలోని ప్రతి బౌలర్ ఓవర్ కు ఆరుకుపైగా రన్స్ ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ 6 ఓవర్లలో 48 రన్స్ ఇవ్వగా.. సిరాజ్ 9 ఓవర్లలో 68 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజ్‌కోట్ లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. రెండో వన్డేలో ఇండియా 399 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా ఇప్పుడు 352 రన్స్ చేసింది.
టాపిక్