IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ - బుమ్రా జోరు - లబుషేన్‌ను ఔట్ చేసిన నితీష్ - సిరాజ్‌కు పనిష్‌మెంట్?
IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్‌లో రెండో రోజు తొలి సెషన్‌లో బుమ్రా, నితీష్ ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. మెక్‌స్వీన్, స్మిత్‌లను బుమ్రా ఔట్ చేయగా...లబుషేన్‌ను నితీష్ పెవిలియిన్ పంపించాడు. టీ బ్రేక్ టైమ్ వరకు ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్‌లో రెండో రోజు తొలి సెషన్‌లో భారత్ ఆధిపత్యాన్ని కనబరిచింది. బుమ్రా, నితీష్ కలిసి ఆసీస్ జోరుకు కళ్లెం వేశారు. 86 పరుగుల వద్ద రెండో రోజును ప్రారంభించిన ఆస్ట్రేలియా...మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి మెక్‌స్వీన్ వికెట్ కోల్పోయింది.
తొలిరోజు పట్టుదలతో క్రీజులో నిలిచిన మెక్ స్వీన్‌నురెండోరోజు ఆరంభంలోనే బుమ్రా బోల్తా కొట్టించాడు. 39 పరుగులు చేసిన స్వీన్‌ను పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసి టీమిండియాకు మరో బ్రేక్ ఇచ్చాడు బుమ్రా. స్మిత్ రెండు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.
నితీష్ రెడ్డి...
హాఫ్ సెంచరీ పూర్తిచేసి జోరుమీదున్న లబుషేన్ తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొమ్మిది ఫోర్లతో 64 పరుగులు చేశాడు లబుషేన్. ప్రస్తుతం ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నారు. ట్రావిస్ హెడ్ వన్డే తరహాలోనే ఫోర్లు, సిక్సర్లతో దంచికొండుతోన్నాడు.
63 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ మార్ష్ మాత్రం ఆచితూచి నెమ్మదిగా ఆడుతోన్నాడు. టీ బ్రేక్ టైమ్ లోగా ఆస్ట్రేలియా 59 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది.
కపిల్, జహీర్ రికార్డ్ సమం...
పింక్ బాల్ టెస్ట్‌తో బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో యాభై వికెట్లను తీసిన మూడో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేయడం ద్వారా బుమ్రా యాభై వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. గతంలో కపిల్‌దేవ్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. వారి తర్వాత ఈ ఫీట్‌ను సాధించిన మూడో ఇండియన్ క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో బుమ్రా మొత్తం 52 వికెట్లు తీసుకున్నాడు.
సిరాజ్‌కు పనిష్‌మెంట్...
పింక్ బాల్ టెస్ట్‌లో లబుషేన్‌పై బాల్ విసిరిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై పనిష్‌మెంట్ పడనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్ బౌలింగ్ చేస్తోండగా...గ్యాలరీలో ఉన్న ఓ ప్రేక్షకుడు డిస్ట్రబ్ చేయడంతో లబుషేన్ బాల్ వేయడం ఆపమన్నట్లుగా సిరాగ్‌కు చేయి చూపించాడు.
అతడి రిక్వెస్ట్‌ను పట్టించుకోకుండా సిరాజ్ కోపంగా బాల్ అతడివైపు విసిరేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్దేశపూర్వకంగా లబుషేన్‌పై బాల్ విసిరినందుకు సిరాజ్‌కు పనిష్‌మెంట్ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.