IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో టాస్ ఓడిన టీమిండియా - ఆస్ట్రేలియా బ్యాటింగ్ - గిల్ స్థానంలో సుందర్ రీఎంట్రీ
IND vs AUS 4th Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ గురువారం మొదలైంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ ను పక్కనపెట్టిన టీమ్ మిండియా మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
IND vs AUS 4th Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ గురువారం మొదలైంది. మెల్‌బోర్న్ వేదికగా మొదలైన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఇండియా, ఆస్ట్రేలియా తుది జట్లలో తలో మార్పు చేశాయి.
శుభ్‌మన్ గిల్ స్థానంలో టీమిండియాలోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. జడేజా, సుందర్ ఇద్దరు స్పిన్నర్లతో బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా బరిలోకి దిగింది.
మూడో స్థానంలో...
ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో గిల్ స్థానంలో రోహిత్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగబోతున్నాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కొనసాగనున్నారు. కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ రాబోతున్నాడు.
కోహ్లి, రోహిత్ ఫామ్...
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లో నిరాశపరిచింది. గబ్బా టెస్ట్‌లో ఓటమి అంచున ఉన్న టీమిండియాను కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో పాటు బుమ్రా ఆదుకున్నారు. ఈ ముగ్గురి కారణంగా కష్టంగా మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి టెస్ట్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు కోహ్లి పెద్దగా రాణించలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ కూడా రెండు టెస్టుల్లో సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయాడు. వీరిద్దరు ఫామ్ టీమిండియాకు కీలకం కానుంది. పంత్ కూడా బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్‌లో బుమ్రా మినహా మిగిలిన వారు అంతగా రాణించడం లేదు. బుమ్రాపైనే మరోసారి టీమిండియా భారీగా ఆశలు పెట్టుకుంది.
వన్డే తరహాలో...
మరోవైపు బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్‌లోకి పంతొమ్మిదేళ్ల సామ్ కాన్‌స్టాస్ అడుగుపెట్టాడు. హేజిల్‌వుడ్ స్థానంలో అతడిని తుది జట్టులోకి తీసుకున్నారు.
ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో కాన్‌స్టాస్ బ్యాట్ ఝులిపిస్తోన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా నలభై ఎనిమిది పరుగులు చేసింది. కాన్‌స్టాస్ వన్డే తరహాలోనే 44 బాల్స్‌లో నలభై ఐదు పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. ఖవాజా పదహారు పరుగులతో క్రీజులో ఉన్నారు.
1-1తో సమం...
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 1-1తో ఇండియా ఆస్ట్రేలియా సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించగా...రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది.