IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍కు భారత జట్టు ప్రకటన నేడే..
India vs Australia: వన్డే ప్రపంచకప్ కంటే ముందే ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ కోసం జట్టును భారత సెలెక్టర్లు నేడు ప్రకటించనున్నారు. ఆ వివరాలివే.
India vs Australia: ఆసియాకప్ 2023 టైటిల్‍ను భారత్ ఘనంగా దక్కించుకుంది. కొలంబోలో ఆదివారం జరిగిన ఫైనల్‍లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి 8వసారి ఆసియా టైటిల్ పట్టింది. అక్టోబర్ 5న భారత్ వేదికగా మొదలుకానున్న వన్డే ప్రపంచకప్‍నకు సన్నాహకంగా భావించిన ఆసియాకప్‍లో రోహిత్‍సేన అదరగొట్టింది. అయితే, వన్డే ప్రపంచకప్ కంటే ముందే ఇండియాలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. ఈనెల (సెప్టెంబర్) 22నే ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం జట్టును నేడు (సెప్టెంబర్ 18) ప్రకటించనున్నారు టీమిండియా సెలెక్టర్లు. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం నేడు భారత జట్టు ఎంపిక కానుంది. నేటి రాత్రి టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచకప్‍నకు ముందు స్వదేశంలో జరిగే మ్యాచ్‍లు కావటంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా భారత్‍కు కీలకంగా మారింది.
అయితే, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‍కు విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా సహా మరికొందరికి రెస్ట్ ఇస్తారా లేదా కొనసాగిస్తారా అనేది చూడాలి. ఎవరికైనా విశ్రాంతి ఇస్తే సంజూ శాంసన్‍కు టీమిండియాలో మళ్లీ చోటు లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైనే సెలెక్టర్లు, కెప్టెన్ రోహిత్ తీవ్ర సమాలోచనలు చేసినట్టు సమాచారం. అలాగే, రవిచంద్రన్ అశ్విన్‍ను సెలెక్టర్లు ఏమైనా వన్డేలకు మళ్లీ పరిగణనలోకి తీసుకుంటారా అనేది చూడాలి.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే ..
ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే సెప్టెంబర్ 22వ తేదీన మోహాలీ వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 24వ తేదీన ఇండోర్ వేదికగా రెండో వన్డే జరగనుంది. సెప్టెంబర్ 27న రాజ్‍కోట్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేలో తలపడతాయి. ఈ మ్యాచ్‍లన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతాయి.
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
భారత్‍తో మూడు వన్డేల సిరీస్‍కు జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. దక్షిణాఫ్రికా సిరీస్‍లో లేని ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.. భారత్‍తో సిరీస్‍కు ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చారు.
భారత్‍తో వన్డే సిరీస్‍కు ఆస్ట్రేలియా టీమ్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోస్ హాజెల్‍వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్ వెల్, తన్వీర్ సంఘా, మ్యాట్ షాట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. ఈ ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ కూడా ఆడనుంది ఇండియా.
టాపిక్