IND vs AUS T20I: ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్.. జట్టు కెప్టెన్, మ్యాచ్ తేదీలు ప్రకటన-india squad and schedule for australia t20i series 2023 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus T20i: ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్.. జట్టు కెప్టెన్, మ్యాచ్ తేదీలు ప్రకటన

IND vs AUS T20I: ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్.. జట్టు కెప్టెన్, మ్యాచ్ తేదీలు ప్రకటన

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2023 10:58 PM IST

India Squad For T20I Series: మరోసారి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరు జరగనుంది. ఆస్ట్రేలియాతో ఇండియా ఆడనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ వివరాలను తాజాగా ప్రకటించగా.. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ వైజాగ్‌కు చేరుకున్నారు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ 2023 జట్టు, మ్యాచ్ తేది వివరాలు
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ 2023 జట్టు, మ్యాచ్ తేది వివరాలు

India vs Australia T20I Series 2023: ఆదివారం (నవంబర్ 19) వరల్డ్ కప్ 2023 పోరు ముగిసింది. భారత్‌పై ఆస్ట్రేలియా గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మళ్లీ కంగారులతో టీమిండియా పోటీ పడేందుకు సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీసులో మొత్తంగా ఆస్ట్రేలియాతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

భారత జట్టు

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌కు అవకాశం కల్పించారు.

నవంబర్ 23 నుంచి

వరల్డ్ కప్ 2023లో ఆడిన చాలామంది ప్లేయర్స్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు కోచ్‌గా వీవీఎస్ లక్షణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. కంగారులతో జరిగే ఈ టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్‌లో నవంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. వారిలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేష్, రింకూ సింగ్ తదితరులు ఉన్నారు.

టీ20 సిరీస్ షెడ్యూల్ వివరాలు చూస్తే..

టీ20 1వ మ్యాచ్- నవంబర్ 23- విశాఖపట్నం

టీ20 2వ మ్యాచ్- నవంబర్ 26- తిరువనంతపురం

టీ20 3వ మ్యాచ్- నవంబర్ 28- గువహటి

టీ20 4వ మ్యాచ్- డిసెంబర్ 1- రాయ్‌పూర్

టీ20 5వ మ్యాచ్- డిసెంబర్ 3- బెంగళూరు

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడనున్నాడు. రాయ్‌పూర్, బెంగళూరు వేదికగా జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయాస్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

WhatsApp channel