KL Rahul Drops Catch: రోహిత్ శర్మకి కోపం తెప్పించిన కేఎల్ రాహుల్, ఇలా ఎవరైనా క్యాచ్ వదిలేస్తారా?-india skipper rohit sharma unhappy with virat kohli and kl rahul for not even trying to take new zealand captain catch ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Drops Catch: రోహిత్ శర్మకి కోపం తెప్పించిన కేఎల్ రాహుల్, ఇలా ఎవరైనా క్యాచ్ వదిలేస్తారా?

KL Rahul Drops Catch: రోహిత్ శర్మకి కోపం తెప్పించిన కేఎల్ రాహుల్, ఇలా ఎవరైనా క్యాచ్ వదిలేస్తారా?

Galeti Rajendra HT Telugu

Rohit Sharma: స్లిప్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా.. టామ్ లాథమ్ బ్యాట్ ఎడ్జ్ తాకి బంతి మంచి క్యాచింగ్ పొజీషన్‌లోనే స్లిప్‌లోకి వచ్చింది. కానీ.. ఇద్దరూ ఆ బంతిని వదిలేయడంతో అది కాస్తా బౌండరీకి వెళ్లింది.

విరాట్ కోహ్లీ, జడేజా, కేెఎల్ రాహుల్ (AFP)

న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టుకి గురువారం ఏమీ కలిసిరావడం లేదు. మ్యాచ్‌లో టాస్ గెలిచినా.. ఆ సంతోషం తొలి సెషన్‌లోనే ఆవిరైపోయింది. కేవలం 31.2 ఓవర్లు మాత్రమే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో 46 పరుగులకే ఆలౌటైంది.

ఐదుగురు జీరోకే ఔట్

భారత్ తరఫున రిషబ్ పంత్ చేసిన 20 పరుగుల టాప్ స్కోర్‌కాగా.. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు జీరోకే ఔటైపోయారు. ఆ ఐదుగురిలో విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ ఉన్నారు. రెండు సెషన్లు ముగిసేలోపే ఆలౌటైన భారత్ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరుస్తోంది. కేఎల్ రాహుల్ సింపుల్‌గా పట్టుకోవాల్సిన క్యాచ్‌ను వదిలేసి.. కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు.

క్యాచ్ పట్టమంటే దిక్కులు

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ విసిరిన బంతిని డ్రైవ్ చేసేందుకు కెప్టెన్ టామ్ లాథమ్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. ఆ బంతి నేరుగా సెకండ్ స్లిప్‌లోని కేఎల్ రాహుల్ చేతుల్లోకి వెళ్తుండటంతో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ పక్కకి తొలిగాడు.

కానీ.. బంతి తనకి మంచి క్యాచింగ్ పొజీషన్‌లో వచ్చినా కేఎల్ రాహుల్ నాకేమీ సంబంధం లేదన్నట్లు పక్కకి తప్పుకున్నాడు. దాంతో బంతి నేరుగా వెళ్లి బౌండరీ లైన్‌ను తాకింది. అప్పటికిగానీ కేఎల్ రాహుల్‌కి తాను చేసిన తప్పిదం అర్థం కాలేదు. అసలు ఆ క్యాచ్ రాహుల్ ఎందుకు పట్టలేదు? కనీసం ఎందుకు ప్రయత్నించలేదు? అనేది పెద్ద మిస్టరీగా మారింది.

లైఫ్ తర్వాత టామ్ లాథమ్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ 49 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. కానీ.. కేఎల్ రాహుల్ చేసిన ఫీల్డింగ్ తప్పిదంపై రోహిత్ శర్మ మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించాడు.

చెత్త రికార్డ్ నమోదు చేసిన భారత్

భారత్ గడ్డపై టీమిండియాకి చెందిన ఐదుగురు బ్యాటర్లు ఒక టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అవడం ఇది రెండో సారి మాత్రమే. అంతకముందు 1999లో మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో ఇలా జరిగింది. అయితే.. భారత జట్టు 50 పరుగులు కూడా ఒక ఇన్నింగ్స్‌లో చేయకపోవడం మాత్రం ఇదే తొలిసారి. బెంగళూరు టెస్టులో భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

బెంగళూరు టెస్టులో తొలి రోజైన బుధవారం వర్షం కారణంగా మూడు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఈరోజు రోహిత్ శర్మ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ.. హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా గాల్లోని తేమని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు.