Ind vs SA 1st T20I Live Streaming: ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 కాసేపట్లోనే ప్రారంభం.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..
Ind vs SA 1st T20I Live Streaming: ఇండియా, సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ శుక్రవారం (నవంబర్ 8) ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ రెండు టీమ్స్ తలపడుతున్న తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.
Ind vs SA 1st T20I Live Streaming: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగిండియా ఓ చిన్న టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా వెళ్లింది. ఈ ఏడాది జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన ఈ రెండు టీమ్స్.. ఇప్పుడు మరోసారి నాలుగు టీ20ల సిరీస్ లో ఆడనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (నవంబర్ 8) డర్బన్‌లో తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలయ్యే ముందు టీమిండియా అభిమానులకు ఓ టీ20 సిరీస్ విందు రెడీగా ఉంది. ఓవైపు టెస్టు టీమ్ ఆ ఐదు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతుండగా.. మరోవైపు టీ20 టీమ్ సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. అక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి తమ స్వదేశంలో ప్రతీకారం తీర్చుకోవాడానికి సౌతాఫ్రికా రెడీ అవుతోంది. క్లాసెన్, మిల్లర్, మార్‌క్రమ్ లాంటి ప్లేయర్స్ తో పటిష్టంగా ఉన్న సఫారీ టీమ్.. ఈ సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ నాలుగు టీ20ల సిరీస్ తో ఈ ఏడాది ఇండియన్ టీమ్ వైట్ బాల్ క్రికెట్ ముగుస్తుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆ టీమ్ తో ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 లైవ్ స్ట్రీమింగ్
ఇండియా, సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం (నవంబర్ 8) డర్బన్ లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు మొదలవుతంది. అంటే మన టైమ్ జోన్ ప్రకారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది.
8 గంటలకు టాస్ ఉంటుంది. డర్బన్ లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ ను టీవీ ఛానెల్లో అయితే స్పోర్ట్స్ 18లో చూడొచ్చు. ఇక ఆన్‌లైన్ లో అయితే జియో సినిమాలో మ్యాచ్ స్ట్రీమింగ్ కానుంది.
ఇండియా తుది జట్టు ఇదేనా?
టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది టీమిండియా. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్ కు రోహిత్ గుడ్ బై చెప్పడంతో సూర్యకుమార్ కు కెప్టెన్సీ లభించిన విషయం తెలిసిందే. శ్రీలంకలో అతని కెప్టెన్సీలో జరిగిన తొలి పూర్తి స్థాయి సిరీస్ లో క్లీన్‌స్వీప్ చేసిన ఇండియన్ టీమ్.. ఆ తర్వాత బంగ్లాదేశ్ పైనా అదే రిపీట్ చేసింది. ఇప్పుడు సౌతాఫ్రికాను ఎదుర్కోబోతోంది. తొలి టీ20కి తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.
తుది జట్టు అంచనా: సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య రమన్ దీప్ సింగ్, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ దయాల్, అర్షదీప్ సింగ్