Ind vs SA 1st T20 Toss: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. టీమిండియా మొదట బ్యాటింగ్.. తుది జట్టులో హైదరాబాద్ బ్యాటర్
Ind vs SA 1st T20 Toss: ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో సఫారీ కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
Ind vs SA 1st T20 Toss: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ టాస్ ఓడిపోయాడు. డర్బన్ లో కండిషన్స్ మొదట బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో సౌతాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 టాస్
సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 శుక్రవారం (నవంబర్ 8) డర్బన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన మార్‌క్రమ్.. పిచ్ లో ఉన్న తేమను తమకు అనుకూలంగా మలచుకోవడానికి మొదట బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు వర్షం కూడా పడే అవకాశం ఉండటంతో మొదట బ్యాటింగ్ కంటే చేజింగ్ సులువు కానుంది. దీంతో మార్‌క్రమ్ మరో ఆలోచన లేకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అటు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకునేవాడిని అని అనడం విశేషం. ఈ పిచ్ తాము ప్రాక్టీస్ చేసిన వికెట్ల కంటే మెరుగ్గా ఉందని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ లోని ప్లేయర్స్ భయం లేకుండా బరిలోకి దిగుతున్నారని, దీంతో తన పని సులువవుతోందని అతడు అన్నాడు.
ఈ ఏడాది జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికానే ఓడించి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ రెండు టీమ్స్ ఓ టీ20లో తలపడటం ఇదే తొలిసారి. తమ స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కావడంతో సౌతాఫ్రికా ఫేవరెట్ గా దిగుతోంది. మరి ఈ నాలుగు టీ20ల సిరీస్ లో సఫారీ జట్టును సూర్యకుమార్ సేన ఎంత వరకూ నిలువరించగలదో చూడాలి.
ఇండియా తుది జట్టు ఇదే
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా తుది జట్టు ఇదే
రియాన్ రికెల్టన్, ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రూగర్, మార్కో యాన్సెన్, ఆండిలె సిమెలేన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, ఎన్‌ఖబాయోజ్మి పీటర్