IND v NZ Semi Final: భారత్, న్యూజిలాండ్ సెమీస్ ఫైట్‍కు అంతా రెడీ.. పిచ్, వాతావరణం ఎలా ఉండనున్నాయి? లైవ్ వివరాలివే..
IND v NZ ICC World Cup 2023 Semi Final: ప్రపంచకప్ సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం (నవంబర్ 15) ఈ మ్యాచ్ జరగనుంది. వివరాలివే..
IND v NZ ICC World Cup 2023 Semi Final: వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్ పోరుకు సర్వం సిద్ధమైంది. సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍తో తలపడేందుకు టీమిండియా కదనరంగంలోకి దిగనుంది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‍ల్లో గెలిచి సత్తాచాటిన భారత జట్టు.. సెమీస్‍లోనూ అజేయయాత్రను కొనసాగించాలనే కసితో ఉంది. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫైట్ భారత్, న్యూజిలాండ్ బుధవారం (నవంబర్ 15) జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా, కివీస్ తలపడనున్నాయి. ఈ సెమీస్ గెలిచి 2019 పరాభవానికి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ వివరాలివే..
పిచ్ ఎలా ఉండొచ్చు
India vs New Zealand: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగే వాంఖెడే పిచ్ బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉంటుంది. అయితే, కొత్త బంతితో కొన్ని ఓవర్ల పాటు ఫాస్ట్ బౌలర్లకు ఈ పిచ్ సహకరిస్తుంది. పేసర్ బౌలర్లకు స్వింగ్ లభిస్తుంది. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‍కే ఎక్కువగా అనుకూలిస్తుంది ఈ పిచ్. అయితే, రెండో బ్యాటింగ్ సమయంలో పిచ్ పేసర్లకు మరింత ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో స్వింగ్ కాస్త ఎక్కువగా లభించే ఛాన్స్ ఉంది. అందుకే టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రపంచకప్‍లో వాంఖడేలో స్పిన్నర్ల కంటే పేసర్లే అధిక వికెట్లు తీశారు.
వాతావరణం
భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ జరిగే బుధవారం (నవంబర్ 15) ముంబైలో వర్షం పడే అవకాశాలు లేవు. వాన పడే ఛాన్స్ లేదని వాతావరణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా వేశాయి.
మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు
IND vs NZ Match Time: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం (నవంబర్ 15) మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. అరగంట ముందు అంటే మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది.
ప్రతీకార పోరు..
ఈ సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియాకు ఒకరకంగా ప్రతీకార పోరుగా ఉండనుంది. 2019 వన్డే ప్రపంచకప్‍లోనూ దూకుడు చూపిన భారత్ సెమీఫైనల్‍కు చేరింది. అయితే, ఆ సెమీస్‍లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు ఓటమి ఎదురైంది. దీంతో, ఇప్పుడు ఈ ప్రపంచకప్ సెమీస్‍లో న్యూజిలాండ్‍ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత్ ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‍లో ఫుల్ గెలుపు జోష్‍తో ఉన్న టీమిండియానే ఈ సెమీస్‍లో ఫేవరెట్‍గా ఉంది.
తుది జట్లు ఇలా!
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాంప్‍మన్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్