Ind vs nz semi final celebrities: ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు సెలబ్రిటీల క్యూ.. ఎవరెవరు వస్తున్నారంటే?
Ind vs nz semi final celebrities: ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు సెలబ్రిటీలు క్యూ కట్టనున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం (నవంబర్ 15) మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Ind vs nz semi final celebrities: వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడటానికి పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హాట్ కూడా రానున్నాడు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాది మంది భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రజనీ నుంచి వెంకీ వరకు..
ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ అంటే మామూలుగా ఉండదు. లీగ్ స్టేజ్ లో ఒకసారి కివీస్ టీమ్ ను ఇండియా ఓడించింది. అయితే నాకౌట్ లో ఉండే ఒత్తిడికి ఎవరు చిత్తవుతారో వాళ్లే సెమీస్ లో ఓటమి పాలవుతారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. అందుకే ఈ మ్యాచ్ చూడటానికి ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే ముంబై చేరుకున్నాడు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వచ్చాడు. అతనితోపాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, టాలీవుడ్ నుంచి వెంకటేశ్ లాంటి వాళ్లు వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులను బీసీసీఐ ఆహ్వానించడం విశేషం.
ఇక ఈ మ్యాచ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ నిలవనున్నాడు. ఈ సెమీఫైనల్ చూడటానికి అతడు కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. వాంఖడే మొత్తం ఓ నీలి సముద్రాన్ని తలపించనుంది. వేలాది మంది అభిమానులు టీమిండియాను చీర్ చేయనున్నారు.
ఈ సెమీఫైనల్ గెలిచే టీమ్ ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్ గురువారం (నవంబర్ 16) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.