IND vs ENG T20: షమీ ఈజ్ బ్యాక్.. ఇంగ్లండ్‍తో టీ20లకు భారత జట్టు ఇదే.. వైస్ కెప్టెన్‍గా ఆల్‍రౌండర్.. పంత్‍కు నో ప్లేస్
IND vs ENG T20 Series: ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. మహమ్మద్ షమీ తిరిగి టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‍కు దూరమయ్యారు. జట్టులో ఎవరు ఉన్నారంటే..
ఇంగ్లండ్‍తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‍లకు భారత్ సిద్ధమవుతోంది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 మధ్య జరనుంది. ఈ టీ20 సిరీస్‍కు 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు నేడు (జనవరి 11) ప్రకటించారు. ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్‍కు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చేశాడు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. జట్టు ఎలా ఉందంటే..
14 నెలల తర్వాత షమీ
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సుమారు 14 నెలల తర్వాత ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍తో టీమిండియాలోకి వచ్చేశాడు. 2023 నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‍లో షమీ గాయపడ్డాడు. ఆ తర్వాత సర్జరీ కూడా చేయించుకున్నాడు. దీంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే షమీ కోలుకున్నాడు. కొన్ని దేశవాళీ మ్యాచ్‍లు ఆడాడు. దీంతో ఫిట్‍నెస్ నిరూపించుకున్న అతడిని సెలెక్టర్లు.. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు ఎంపిక చేశారు. మొత్తంగా షమీ రీఎంట్రీ కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కోల్‍కతాలో ఇంగ్లండ్‍తో జనవరి 22న జరిగే తొలి టీ20లో షమీ బరిలోకి దిగనున్నాడు.
ముగ్గురు మిస్
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు ఎంపిక చేసిన జట్టులో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శుభ్‍మన్ గిల్ లేరు. బుమ్రా గాయం వల్ల విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. పంత్, గిల్‍ను కూడా తీసుకోలేదు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, ధృవ్ జురెల్ జట్టులో ఉన్నారు.
వైస్ కెప్టెన్‍గా అక్షర్ పటేల్
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్‍ను వైస్ కెప్టెన్ చేశారు సెలెక్టర్లు. సూర్య కుమార్ యాదవ్‍కు డిప్యూటీగా అతడు ఉండనున్నాడు. ఇది కూడా కీలక నిర్ణయంగా ఉంది. వాషింగ్టన్ సుందర్ మళ్లీ భారత టీ20 జట్టులోకి వచ్చేశాడు.
ఇద్దరు తెలుగు ఆటగాళ్లకు ప్లేస్
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టులో తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. మంచి ఫామ్‍లో ఉన్న ఈ ఇద్దరు ప్లేయర్లు ఈ సిరీస్‍లో బరిలోకి దిగనున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో నితీశ్ రాణించాడు. గత టీ20 సిరీస్‍లో తిలక్ దుమ్మురేపాడు.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్
టీ20 సిరీస్ షెడ్యూల్
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ఉండనుంది . తొలి టీ20 జనవరి 22వ తేదీన కోల్‌కతా వేదికగా ఉండనుంది. జనవరి 25న రెండో టీ20 చెన్నైలో ఉండనుంది. మూడో టీ20 జనవరి 28న రాజ్‌కోట్‌లో, జనవరి 31న నాలుగో టీ20 పుణెలో జరుగుతుంది. ఫిబ్రవరి 2న ముంబైతో జరిగే ఐదో టీ20తో ఈ టీ20 సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య జరగనుంది.
సంబంధిత కథనం