IND vs ENG 5th Test: ఐదో టెస్ట్ కోసం టీమిండియా జట్టు ఇదేనా? - మరో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్?
IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్ ద్వారా టీమిండియాలో దేవదత్ పడిక్కల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాయంతో ఐదో టెస్ట్‌కు రాహూల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో జోరు మీదున్నది. 3-1 తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకున్నది. చివరిదైన ఐదో టెస్ట్‌లో అదే జోరును కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. కోహ్లి, కేఎల్ రాహుల్‌తో పాటు పలువురు సీనియర్లు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వంటి యంగ్ ప్లేయర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా అద్భుతమే చేసింది. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లోకి సర్ఫరాజ్‌ఖాన్, ధ్రువ్ జురేల్, ఆకాష్ దీప్, రజత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రజత్ పాటిదార్ మినహా మిగిలిన వారందరూ రాణించారు.
దేవదత్ పడిక్కల్ ఎంట్రీ…
తాజాగా ఐదో టెస్ట్‌లో అదే ఫార్ములాను ఫాలో కావాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. మరో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. దేవదత్ పడిక్కల్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజత్ పాటిదార్ విఫలం కావడంతో అతడి స్థానంలోనే దేవదత్ పడిక్కల్‌ను తీసుకోనున్నట్లు తెలిసింది. దేవదత్ పడిక్కల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అంటున్నారు.
మూడు టెస్టుల్లో 63 పరుగులు...
ఈ సిరీస్‌లో రజత్ పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేశాడు. దాంతో అతడికి మరో ఛాన్స్ ఇవ్వడం కంటే దేవదత్ పడిక్కల్‌ను ఈ టెస్ట్‌లో ఆడించడం మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దేవదత్ పడిక్కల్ ఎంట్రీతో రజత్ పాటిదార్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఒకవేళ దేవదత్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే ఈ సిరీస్‌లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదో క్రికెటర్‌గా నిలుస్తాడు.
రాహుల్ దూరం..
ఐదో టెస్ట్ కేఎల్ రాహుల్ ఆడనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అందుకే ఐదో టెస్ట్ కోసం అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదని అంటున్నారు. అతడి స్థానంలో జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రజత్ పాటిదార్‌ను టీమ్‌తో కొనసాగించబోతున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ఐపీఎల్ వరకు అతడు క్రికెట్ ఆటకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అశ్విన్ వంద టెస్టులు..
ధర్మశాల టెస్ట్ అశ్విన్ కెరీర్‌లో వందో టెస్ట్ కావడం గమనార్హం. ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో అశ్విన్ అడుగుపెట్టాడు. 99 టెస్టుల్లో 507 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా తరఫున వంద టెస్ట్‌లు ఆడిన పదమూడో క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. 200 టెస్టులతో ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల లిస్ట్‌లో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లలో 113 టెస్టులు ఆడాడు.