Ind vs Eng 3rd T20: టీమిండియాతో మూడో టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. ఓడినా అదే టీమ్‌తో..
Ind vs Eng 3rd T20: టీమిండియాతో మంగళవారం (జనవరి 28) జరగబోయే మూడో టీ20 కోసం తమ తుది జట్టును అనౌన్స్ చేసింది ఇంగ్లండ్. గుజరాత్ లోని రాజ్‌కోట్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు కూడా జట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Ind vs Eng 3rd T20: ఇండియాతో తొలి రెండు టీ20లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్.. మూడో టీ20 కోసం కూడా ఒక రోజు ముందే తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. సిరీస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లోనూ రెండో టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఐదు టీ20ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సిరీస్ ను రాజ్‌కోట్ లోనే కైవసం చేసుకోవాలని చూస్తోంది.
మూడో టీ20కి ఇంగ్లండ్ టీమ్ ఇదే
టీమిండియా టీ20 సిరీస్ లో ప్రతి మ్యాచ్ కు ఒక రోజు ముందే తుది జట్టును అనౌన్స్ చేస్తున్న ఇంగ్లండ్.. మూడో మ్యాచ్ ముందు కూడా అదే పని చేసింది. రెండో టీ20లో ఆడిన జట్టునే మూడో మ్యాచ్ కోసం కూడా కొనసాగిస్తున్నట్లు సోమవారం (జనవరి 27) వెల్లడించింది.
తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పు చేసిన రెండో టీ20 బరిలోకి దిగిన ఆ టీమ్.. మూడో మ్యాచ్ కు మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ఓపెనర్లు కాగా.. కెప్టెన్ జోస్ బట్లర్ మూడో స్థానంలో రానున్నాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్ వస్తారు.
బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ లతో పేస్ బౌలింగ్ అటాక్ బలంగా ఉండగా.. ఆదిల్ రషీద్ స్పిన్ బౌలింగ్ భారం మోయనున్నాడు.
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ ఇలా..
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. ఈ రెండింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో చాలా సులువుగా 7 వికెట్లతో గెలవగా.. రెండో మ్యాచ్ లో కాస్త కష్టంగానే అయినా తిలక్ వర్మ మెరుపులతో రెండు వికెట్లతో గట్టెక్కింది.
దీంతో సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మూడో మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో రాజ్‌కోట్ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది.
మూడో టీ20కి ఇంగ్లండ్ తుది జట్టు
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
సంబంధిత కథనం