IND vs ENG 2nd T20: టాస్ గెలిచిన భారత్.. తుదిజట్టులో రెండు మార్పులు.. తెలుగు ఆటగాడు దూరం.. ఎందుకో చెప్పిన సూర్య!-ind vs eng 2nd t20 update india won toss choose bowling two changes in playing xis nitish kumar reddy out ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 2nd T20: టాస్ గెలిచిన భారత్.. తుదిజట్టులో రెండు మార్పులు.. తెలుగు ఆటగాడు దూరం.. ఎందుకో చెప్పిన సూర్య!

IND vs ENG 2nd T20: టాస్ గెలిచిన భారత్.. తుదిజట్టులో రెండు మార్పులు.. తెలుగు ఆటగాడు దూరం.. ఎందుకో చెప్పిన సూర్య!

IND vs ENG 2nd T20: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 షురూ అయింది. టాస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.

IND vs ENG 2nd T20: (AFP)

ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో అదిరే ఆరంభం చేసిన భారత్.. రెండో పోరుకు బరిలోకి దిగింది. నేడు (జనవరి 25) చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఐదు టీ20ల సిరీస్‍లో ఫస్ట్ గేమ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సారథ్యంలోని భారత్.. రెండో మ్యాచ్‍కు హుషారుగా అడుగుపెట్టింది. ఈ రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.

నితీశ్ కుమార్ రెడ్డి ఔట్

తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి.. భారత జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ సిరీస్‍ నుంచి నితీశ్ ఔట్ అయ్యాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయయంలో చెప్పాడు. నితీశ్ స్థానంలో చెన్నై లోకల్ ఆల్‍రౌండర్ వాషింగ్టన్ సుందర్.. టీమిండియా తుదిజట్టులోకి వచ్చాడు.

రింకూ స్థానంలో జురెల్

భారత యంగ్ హిట్టర్ రింకూ సింగ్ కూడా గాయం వల్ల ఈ మ్యాచ్‍లో లేడు. అతడి స్థానంలో ధృవ్ జురెల్‍ను భారత్ తీసుకుంది. మొత్తంగా గత మ్యాచ్‍తో పోలిస్తే తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. నితీశ్ కుమార్, రింకూ దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, జురెల్ చోటు దక్కించుకున్నారు. తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ కూడా ఈ మ్యాచ్ ముందు స్వల్పంగా గాయపడినట్టు తెలిసింది. అయితే, కోలుకున్న అతడు ఈ రెండో టీ20 ఆడుతున్నాడు.

ఇంగ్లండ్ కూడా తుది జట్టులో రెండు ఛేంజెస్ చేసింది. బెథెల్ ప్లేస్‍లో జేమీ స్మిత్ టీమ్‍లోకి వచ్చాడు. అట్కిన్‍సన్ ప్లేస్‍లో కార్సేను తీసుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ చెప్పాడు.

షమీకి మళ్లీ నో ప్లేస్

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి మళ్లీ నిరాశే ఎదురైంది. గాయం నుంచి కోలుకున్న షమీ 14 నెలల తర్వాత ఈ సిరీస్‍తో భారత జట్టులోకి తిరిగివచ్చాడు. అయితే, ఫస్ట్ టీ20లోకి పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు రెండో టీ20లోనూ టీమిండియా తుదిజట్టులో షమీకి చోటు దక్కలేదు. మళ్లీ బెంచ్‍కే పరిమితం అయ్యాడు.

భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్ తుదిజట్టు: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ ఉడ్

సంబంధిత కథనం