IND vs ENG 2nd T20: షమీ రీఎంట్రీ - అభిషేక్‌కు గాయం - ఇంగ్లండ్‌తో రెండో టీ20లో టీమిండియా ఛేంజెస్ ఇవేనా?
IND vs ENG 2nd T20: ఇండియా, ఇంగ్లండ్ మధ్య నేడు (శనివారం ) చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు చెబుతోన్నారు. రెండో టీ20 ద్వారా షమీ నేషనల్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
IND vs ENG 2nd T20: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శనివారం (నేడు) రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అదే జోరును సెకండ్ టీ20లో కొనసాగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. రెండో టీ20లోటీమిండియా తుది జట్టులో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

షమీ రీఎంట్రీ...
టీమిండియా సీనియర్ పేసర్ షమీ రెండో టీ20లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి టీ20లో హార్దిక్ పాండ్య ఆరంభంలో ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని షమీకి చోటివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్‌లో ఉన్నట్లు సమాచారం. షమీ టీమిండియా తరఫున క్రికెట్ ఆడి 14 నెలలు దాటిపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత అతడు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనుండటం ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ షమీ జట్టులోకి వస్తే ఎవరికి పక్కన పెడతారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అభిషేక్‌కు గాయం...
రెండో టీ20కి హిట్టర్ అభిషేక్ శర్మ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ప్రాక్టీస్‌లో అతడు గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. చీలమండ గాయంతో అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్ గాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
లోకల్ బాయ్...
రెండో టీ20లో వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. తొలి టీ20లో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ క్రికెటర్లు ఇబ్బందులు పడ్డారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ దెబ్బకు 132 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ పరుగుల్ని కట్టడి చేసిన వికెట్లు తీయలేకపోయాడు. అతడి స్థానంలో లోకల్ ప్లేయర్ అయిన సుందర్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నై పిచ్ కూడా స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుంది.
జేమీ స్మిత్....
ఇంగ్లండ్ టీమ్ కూడా తుది జట్టులో మార్పులు చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. జాకబ్ బెతల్ అనారోగ్యం పాలవ్వడంతో అతడి ప్లేస్‌లో 12వ ఆటగాడి జేమీ స్మిత్‌ను ఎంపికచేసింది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో ఐదు టీ20 మ్యాచ్‌లతో పాటు మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.