IND vs ENG 2nd T20: అదరగొట్టిన తెలుగోడు.. అద్భుత పోరాటంతో భారత్‍ను గెలిపించిన తిలక్.. రెండో టీ20లో ఇంగ్లండ్‍పై విజయం-ind vs eng 2nd t20 result tilak varma shines with super fight india beat england in 2nd t20 at chepauk ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 2nd T20: అదరగొట్టిన తెలుగోడు.. అద్భుత పోరాటంతో భారత్‍ను గెలిపించిన తిలక్.. రెండో టీ20లో ఇంగ్లండ్‍పై విజయం

IND vs ENG 2nd T20: అదరగొట్టిన తెలుగోడు.. అద్భుత పోరాటంతో భారత్‍ను గెలిపించిన తిలక్.. రెండో టీ20లో ఇంగ్లండ్‍పై విజయం

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 25, 2025 10:47 PM IST

India vs England 2nd T20 Result: ఇంగ్లండ్‍పై రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అద్భుత అజేయ అర్ధ శతకంతో భారత్‍ను గెలిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చివరి వరకు నిలిచి సత్తాచాటాడు.

IND vs ENG 2nd T20: అదరగొట్టిన తెలుగోడు.. అద్భుత పోరాటంతో భారత్‍ను గెలిపించిన తిలక్.. రెండో టీ20లో ఇంగ్లండ్‍పై విజయం
IND vs ENG 2nd T20: అదరగొట్టిన తెలుగోడు.. అద్భుత పోరాటంతో భారత్‍ను గెలిపించిన తిలక్.. రెండో టీ20లో ఇంగ్లండ్‍పై విజయం (AP)

ఇంగ్లండ్‍తో రెండో టీ20లో ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. టీమిండియా యంగ్ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ చివరి వరకు నిలిచి భారత్‍ను గెలిపించాడు. 55 బంతుల్లో 72 పరుగులతో అద్భుత అర్ధ శకతం చేశాడు. లక్ష్యఛేదనలో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలిచి అదరగొట్టాడు తిలక్. చివరి ఓవర్లో టీమిండియా గెలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు (జనవరి 25) జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‍లో 2-0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. ఉత్కంఠభరితంగా చివరి ఓవర్ వరకు ఈ మ్యాచ్ సాగింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

అద్భుత పోరాటంతో గెలిపించిన తిలక్

తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (55 బంతుల్లో బంతుల్లో 72 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధ శతకంతో అదరగొట్టాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా అద్భుతంగా ఆడాడు తిలక్. 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి భారత్ గెలిచింది. 166 రన్స్ లక్ష్యఛేదనలో ఓ దశలో భారత్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే, తిలక్ ఆఖరు వరకు నిలిచి టీమిండియాను గెలుపు తీరం దాటించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సత్తాచాటాడు. చివరి ఓవర్లో అతడే విన్నింగ్ షాట్ కొట్టాడు.

కష్టాల్లో పడిన భారత్

లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (12), సంజూ శాంసన్ (5) త్వరగా ఔటయ్యాడు. తొలి ఓవర్లో 12 రన్స్ చేసిన అభిషేక్.. రెండో ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో సంజూ ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ధృవ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) వరుసగా పెలియన్ చేరారు. కాసేపు కూడా నిలువలేకపోయారు. దీంతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్.

తిలక్ సూపర్ షో

ఓ వైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ దుమ్మురేపాడు. వాషింగ్టన్ సుందర్ (26) కాసేపు నిలిచాడు. తిలక్‍కు సహకారం అందించాడు. అయితే, సుందర్, అక్షర్ పటేల్ (2), అర్షదీప్ సింగ్ (6) వెనువెంటనే ఔటయ్యారు. అయినా తిలక్ తన దూకుడు కొనసాగించాడు. క్రమంగా పరుగులు రాబట్టాడు. జట్టును గెలుపు వైపుగా నడిపించాడు. 39 బంతుల్లోనే అర్ధ శతకం చేరాడు. గెలుపే లక్ష్యం అన్నట్టు హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకోలేదు. చివర్లో రవి బిష్ణోయ్ (9 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు ఒత్తిడిని తట్టుకొని నిలిచి సత్తాచాటాడు తిలక్. అద్భుత పోరాటంతో టీమిండియాను గెలిపించాడు. గాల్లోకి ఎగురుతూ విజయ సంబరాలు చేసుకున్నాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కార్సే మూడు వికెట్లు తీసుకున్నాడు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, జెమీ ఓవర్టన్, లియామ్ లివింగ్‍స్టోన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

ఆరంభంలో భారత బౌలర్లు అదుర్స్.. రాణించిన బట్లర్

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఇంగ్లిష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (4)ను తొలి ఓవర్లోనే భారత పేసర్ అర్షదీప్ సింగ్ పెవిలియన్‍కు పంపాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (3)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. మరోవైపు జోస్ బట్లర్ (30 బంతుల్లో 45 పరుగులు; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా బట్లర్ రాణించాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. హ్యారీ బ్రూక్ (13)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. కాసేపటికే బట్లర్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. దీంతో 9.3 ఓవర్లలోనే 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లండ్. లివింగ్‍స్టోన్ (13) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.

దూకుడుగా ఆడిన లోయర్ ఆర్డర్

ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొట్టారు. ముందు జెమీ స్మిత్ (12 బంతుల్లో 22 పరుగులు) దూకుడుగా ఆడగా.. బిడోన్ కార్సే (17 బంతుల్లో 31 పరుగులు) హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడారు. జెమీ స్మిత్ ఔటైనా.. చివర్లో కార్సే విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ 9 వికెట్లకు 165 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. లక్ష్యాన్ని19.2 ఓవర్లలో ఛేదింది భారత్ గెలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 28న రాజ్‍కోట్‍లో జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం