IND vs ENG 1st T20: షమీపైనే అందరి కళ్లు.. ఇంగ్లండ్‍తో తొలి టీ20కి భారత తుది జట్టు ఇలా! టైమ్, లైవ్ వివరాలివే..
India vs England 1st T20: ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు భారత్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రేపు (జనవరి 22) తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టు ఎలా ఉండొచ్చో, మ్యాచ్ లైవ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‍తో టీ20 సమరానికి భారత్ సన్నద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టుతో ఐదు టీ20ల సిరీస్‍లో టీమిండియా తలపడనుంది. సిరీస్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ రెడీ అయింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు (జనవరి 21) తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టు ఎలా ఉండొచ్చో, మ్యాచ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
షమీపై ఫోకస్
స్టార్ పేసర్ మహమ్మద్ షమీ 14 నెలల తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చేశాడు. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్‍లో గాయపడిన షమీ ఆ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ఇంగ్లండ్‍తో తొలి టీ20లో షమీ తుది జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. సుమారు 14 నెలల తర్వాత జట్టులోకి వస్తుండటంతో షమీపై ఈ మ్యాచ్‍లో ఎక్కువ ఫోకస్ ఉండనుంది. అతడి ఫిట్‍నెస్, బౌలింగ్ లయ, పేస్ సహా చాలా విషయాలపై ఆసక్తి నెలకొని ఉంది.
ఓపెనర్లుగా సంజూ, అభిషేక్
ఇంగ్లండ్‍తో తొలి టీ20లో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో గత టీ20 సిరీస్‍లో ఇద్దరూ సెంచరీలతో దుమ్మురేపారు. మూడో స్థానంలో తిలక్ వర్మ, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి.
నితీశ్‍కు చోటు దక్కుతుందా!
తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. యంగ్ పేసర్ హర్షిత్ రాణాకు ఈ మ్యాచ్‍లో అవకాశం ఇవ్వాలని మేనేజ్‍మెంట్ అనుకుంటే నితీశ్‍ను పక్కన పెట్టే అవకాశం ఉంది. హార్షిత్‍కు తుది జట్టులో ఛాన్స్ దొరికితే అతడు భారత్ తరఫున అరంగేట్రం చేస్తాడు. మరి టీమిండియా మేనేజ్‍మెంట్ ఏం చేస్తుందో చూడాలి.
స్టార్ ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ఫినిషర్లుగా ఉంటారు. ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్‍కు వైస్ కెప్టెన్‍గా ఎంపికయ్యాడు. అతడితో పాటు వరుణ్ చక్రవర్తి స్పిన్నర్‌గా తుది జట్టులో ఉండే ఛాన్స్ ఎక్కువ. పేసర్లుగా అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ ఉండే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‍తో తొలి టీ20లో భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి / హర్షిత్ రాణా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ
మ్యాచ్ టైమ్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 రేపు (జనవరి 22) సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. అందుకు అరగంట ముందు 6.30 గంటలకు టాస్ పడుతుంది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఈ టీ20 సిరీస్ మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.
సంబంధిత కథనం