IND vs ENG 1st ODI: రాహుల్, పంత్‍ల్లో ఎవరు.. వరుణ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడా? తొలి మ్యాచ్‍కు భారత తుది జట్టు ఇలా..-ind vs eng 1st odi pant or rahul varun chakravarthy may 50 over debut india predicted playing xi live streaming details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 1st Odi: రాహుల్, పంత్‍ల్లో ఎవరు.. వరుణ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడా? తొలి మ్యాచ్‍కు భారత తుది జట్టు ఇలా..

IND vs ENG 1st ODI: రాహుల్, పంత్‍ల్లో ఎవరు.. వరుణ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడా? తొలి మ్యాచ్‍కు భారత తుది జట్టు ఇలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2025 10:52 AM IST

IND vs ENG 1st ODI: ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు భారత్ సమాయత్తమైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్‍లో తుదిజట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. రాహుల్, పంత్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ మ్యాచ్‍కు భారత తుదిజట్టు ఎలా ఉండొచ్చో ఇక్కడ చూడండి.

IND vs ENG 1st ODI: రాహుల్, పంత్‍ల్లో ఎవరు.. వరుణ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడా? తొలి వన్డేలకు భారత తుది జట్టు ఇలా..
IND vs ENG 1st ODI: రాహుల్, పంత్‍ల్లో ఎవరు.. వరుణ్ వన్డే అరంగేట్రం చేయనున్నాడా? తొలి వన్డేలకు భారత తుది జట్టు ఇలా.. (PTI)

ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో భారత్ దుమ్మురేపింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇంగ్లిష్ జట్టుతో వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరగనున్న వన్డే సిరీస్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆ టోర్నీకి సన్నాహకంగా.. వ్యూహాలు, తుది జట్టు కూర్పు ఎలా ఉండాలనేది ఈ సిరీస్‍లోనే స్పష్టత తెచ్చుకోవాలనేది టీమిండియా ప్లాన్‍గా ఉంది. మూడు వన్డేల సిరీస్‍లో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ రేపు (ఫిబ్రవరి 6) నాగ్‍పూర్ వేదికగా జరగనుంది. ఈ పోరులో టీమిండియా తుది జట్టు ఎలా ఉండొచ్చంటే..

yearly horoscope entry point

పంత్, రాహుల్ మధ్య ఉత్కంఠ

వైస్ కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్‍ను ప్రకటించటంతో భారత తుది జట్టులో అతడు ఉండడం ఖాయం. రోహిత్ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్‍కు రానున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‍కు దిగుతారు.

అయితే, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‍ల్లో ఎవరు భారత తుది జట్టులో ఉంటారనదే ఆసక్తికరంగా మారింది. రిషబ్ పంత్ గత రెండు టెస్టు సిరీస్‍ల్లో విఫలమయ్యాడు. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అందుకే కేఎల్ రాహుల్‍కే తుది జట్టులో చోటు దక్కే ఛాన్స్ అధికంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని రాహుల్‍వైపే మేనేజ్‍మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఆల్‍రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటారు. అక్షర్ పటేల్‍కు తుది జట్టులో చోటు డౌటే.

వరుణ్ వన్డే అరంగేట్రం!

టీమిండియా తరఫున టీ20ల్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍లో చెలరేగాడు ఈ మిస్టరీ స్పిన్నర్. దీంతో వన్డేల్లోనూ అతడు అరంగేట్రం చేసే సమీపించాడు. ఇంగ్లండ్‍తో తొలి వన్డేలో అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ బ్యాటింగ్‍లో డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను తీసుకువాలనుకుంటే వరుణ్ బెంచ్‍కే పరిమితం కావాల్సి రావొచ్చు.

స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోపోవటంతో ఈ సిరీస్‍కు దూరమైనట్టే. దీంతో మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ పేసర్లుగా తుది జట్టులో ఉండనున్నారు. మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ ఉండే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్‍తో తొలి వన్డేకు భారత తుదిజట్టు (అంచనా): శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి / వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్

మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్

భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే రేపు (ఫిబ్రవరి 6) మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది. అర గంట ముందు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్‍లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. నాగ్‍పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం