IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍ను దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ, గంభీర్ అదిరిపోయే వ్యూహం!-ind vs ban 1st test india captain rohit sharma and gautham gambhir red soil strategy for bangladesh test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 1st Test: బంగ్లాదేశ్‍ను దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ, గంభీర్ అదిరిపోయే వ్యూహం!

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍ను దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ, గంభీర్ అదిరిపోయే వ్యూహం!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 14, 2024 12:07 PM IST

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టుకు భారత సిద్ధమవుతోంది. కాగా, ఈ టెస్టు కోసం భారత్ ఓ వ్యూహం అమలు చేయనుంది. ఆస్ట్రేలియా సిరీస్‍కు కూడా ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉంది.

IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍ను దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ, గంభీర్ అదిరిపోయే వ్యూహం!
IND vs BAN 1st Test: బంగ్లాదేశ్‍ను దెబ్బకొట్టేందుకు రోహిత్ శర్మ, గంభీర్ అదిరిపోయే వ్యూహం! (HT_PRINT)

బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. తొలి టెస్టు జరిగే చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. సెప్టెంబర్ 17న ఆ మైదానంలో భారత్, బంగ్లా తొలి టెస్టు మొదలుకానుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‍పై తొలిసారి సిరీస్ గెలిచి ఫుల్ జోష్‍లో ఉంది. కాగా, ఈ తొలి టెస్టులో బంగ్లాను దెబ్బకొట్టేందుకు పిచ్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యూహం అమలు చేసేందుకు నిర్ణయించారని తెలుస్తోంది.

ఎర్రమట్టి పిచ్‍తో..

బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు కోసం చెపాక్ స్టేడియం పిచ్‍ తయారీలో రెడ్ సాయిల్ (ఎర్రమట్టి)ని ఎక్కువగా వినియోగించేలా టీమిండియా నిర్ణయించిందని తెలుస్తోంది. సాధారణంగా ఆ స్టేడియంలో నల్లమట్టిని వాడుతున్నా.. ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్‍ వైపే బారత్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. స్పిన్‍కు అనుకూలించే పిచ్‍పై బంగ్లాదేశ్ ఇటీవల రాణిస్తోంది. ఆ జట్టు స్పిన్ విభాగంలోనూ బలంగా కనిపిస్తోంది. తమ దేశంలో బంగ్లాదేశ్‍లో ఎక్కువగా నల్లమట్టి పిచ్‍లపైనే అడుతుంది. అందుకే రెడ్ సాయిల్ పిచ్ అయితే బంగ్లాదేశ్ తిప్పలు పడకతప్పదని భారత మేనేజ్‍మెంట్ భావిస్తోంది.

రెడ్ సాయిల్ పిచ్ స్పిన్‍కు మరీ విపరీతంగా అనుకూలించదు. ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ బాగా లభిస్తుంది. ఎక్కువగా ఆస్ట్రేలియా పిచ్‍ల్లాగా ఉంది. ఇలా అయితే భారత పేసర్లను ఎదుర్కొవడం బంగ్లాదేశ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. స్పిన్‍తో పోలిస్తే బంగ్లా పేస్ విభాగం కాస్త బలహీనంగానే ఉంది. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తొలి టెస్టుకు ఎర్రమట్టి వికెట్‍నే ఇవ్వాలని భారత్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా సిరీస్‍కు కూడా సన్నాహకంగా..

బంగ్లాదేశ్‍తో రెడ్ సాయిల్ పిచ్‍లపై ఆడితే.. ఆస్ట్రేలియాతో ఈ ఏడాది చివర్లో తలపడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍కు కూడా సన్నాహకంగా ఉంటుందని భారత్ భావిస్తోంది. నవంబర్ 22 నుంచి 2025 జనవరి 3 మధ్య ఆసీస్‍ గడ్డపై జరిగే ఈ సిరీస్‍ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అంతకు ముందు జరిగే సిరీస్‍లను దీనికి సన్నాహకంగా భావించనుంది.

బంగ్లాదేశ్ గత నెలలో చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‍ను ఆ దేశ గడ్డపైనే బంగ్లా చిత్తు చేసింది. ఏకంగా 2-0తో సిరీస్‍ను క్లీన్ స్వీప్ చేసింది. పాక్‍పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఫుల్ ఫామ్‍లో ఉన్న ఆ జట్టును టీమిండియాకు కూడా తేలికగా తీసుకోవడం లేదు. అందుకే పూర్తి సామర్థ్యంతోనే బరిలోకి దిగుతోంది.

చెమటోడ్చిన కోహ్లీ

బంగ్లాతో తొలి టెస్టు జరిగే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి ప్రాక్టీస్ సెషన్‍లో విరాట్ కోహ్లీ నెట్స్‌లో సుదీర్ఘంగా చెమటోడ్చాడు. భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఇతర ఆటగాళ్లు కూడా సన్నాహకాలు చేశారు.

భారత్, బంగ్లా మధ్య సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు జరగనుంది. సిరీస్‍లో ఆఖరిదైన రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా సాగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 మధ్య ఇరు జట్లు మూడు టీ20లు ఆడతాయి.