IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. టోర్నీ నుంచి ఆసీస్‍ను ఔట్ చేసే ఛాన్స్!-ind vs aus t20 world cup 2024 india can knock australia out of the tournament ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. టోర్నీ నుంచి ఆసీస్‍ను ఔట్ చేసే ఛాన్స్!

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. టోర్నీ నుంచి ఆసీస్‍ను ఔట్ చేసే ఛాన్స్!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 23, 2024 09:11 PM IST

IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియాతో పోరుకు భారత్ రెడీ అయింది. టీ20 ప్రపంచకప్‍లో తన సూపర్-8 చివరి పోరులో ఆసీస్‍ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ చేరుతుంది భారత్.

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. టోర్నీ నుంచి ఆసీస్‍ను ఔట్ చేసే ఛాన్స్!
IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. టోర్నీ నుంచి ఆసీస్‍ను ఔట్ చేసే ఛాన్స్! (Surjeet Yadav)

IND vs AUS T20 World Cup 2024: గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియాకు ఆస్ట్రేలియా తీరని బాధను మిగిల్చింది. సొంతగడ్డపై ఫైనల్‍కు వెళ్లిన భారత్.. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. తుదిపోరులో తడబడి టైటిల్ చేజార్చుకుంది రోహిత్ శర్మ సేన. అయితే, ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్ ముందు ఉంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీతో తన చివరి సూపర్-8 మ్యాచ్‍లో ఆస్ట్రేలియాతో సోమవారం (జూన్ 24) తలపడనుంది టీమిండియా. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీఫైనల్ చేరడంతో పాటు ఆసీస్‍ను టోర్నీ నుంచి బయటికి పంపేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అదెలానో ఇక్కడ చూడండి.

సూపర్-8లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ సంచలన విజయం సాధించింది. ఒకవేళ ఈ మ్యాచ్‍లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే భారత్ ఇప్పటికే సెమీస్ చేరేది. అఫ్గాన్ గెలువడంతో నాలుగు జట్లు ఉన్న సూపర్-8 గ్రూప్-1లో అన్నింటికీ సెమీస్ అవకాశాలు వచ్చినట్టయింది. అయితే, ఆస్ట్రేలియాపై భారత్ గెలిస్తే.. ఆ జట్టును టోర్నీ నుంచి బయటికి పంపే ఛాన్స్ ఉంది.

ఆస్ట్రేలియా ఔట్ ఎలా..

ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి.. బంగ్లాదేశ్‍పై అఫ్గానిస్థాన్ గెలిస్తే టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమిస్తుంది. గ్రూప్-1 నుంచి భారత్, అఫ్గాన్ సెమీస్ చేరతాయి. ఆసీస్‍పై టీమిండియా గెలిచి.. బంగ్లా, అఫ్గాన్ మ్యాచ్ వాన వల్ల రద్దయినా ఆస్ట్రేలియా ఔట్ అవుతుంది. ఆసీస్‍పై టీమిండియా గెలిస్తే.. ఆరు పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‍పై సెమీస్ అర్హత ఆధారపడి ఉంటుంది.

సూపర్8 గ్రూప్-1 ఇలా..

టీ20 ప్రపంచకప్‍ 2024 సూపర్-8లో రెండు గ్రూప్‍లో ఉన్నాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. సూపర్-8లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‍లు ఆడుతుంది. ఈ గ్రూప్‍లో టాప్-2లో ఉండే రెండు జట్లు సెమీస్ చేరతాయి. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్‍ల్లో గెలిచి భారత్.. 4 పాయింట్లతో ఇప్పుడు టాప్‍లో ఉంది. ఆసీస్‍తో సోమవారం తదుపరి మ్యాచ్ ఆడనుంది. అఫ్గానిస్థాన్ రెండు మ్యాచ్‍ల్లో ఒకటి గెలువగా.. బంగ్లాదేశ్ ఆడిన రెండింట్లో ఓడింది. ఈ రెండు జట్లు సూపర్-8లో చివరి మ్యాచ్‍లో జూన్ 25న తలపడనున్నాయి.

ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తే సెమీస్‍కు అర్హత సాధిస్తుంది. అలాగే, బంగ్లాపై అఫ్గాన్ కూడా విజయం సాధిస్తే.. టీమిండియా ప్రతీకారం పూర్తవుతుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో దెబ్బకొట్టిన ఆసీస్‍పై కక్ష తీర్చుకున్నట్టు అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ముందుగా అయితే సోమవారం (జూన్ 24) ఆసీస్‍ను చిత్తు చేసిన సెమీస్ చేరాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‍లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇప్పటి వరకు అజేయంగా ఉంది. సూపర్-8లోనూ రెండు మ్యాచ్‍ల్లోనూ భారీ విజయాలతో అదరగొట్టింది. ఆస్ట్రేలియాతోనూ అదే జోరు కొనసాగించాలని కసిగా ఉంది. అఫ్గాన్ చేతిలో పరాభవం పాలైన ఆసీస్.. ఇండియాపై గెలిచి సెమీస్ ఆశలను నిలుపుకోవాలనే లక్ష్యంతో  బరిలోకి దిగనుంది.

WhatsApp channel