IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్ - తొలి ఇన్నింగ్స్‌లో 474 రన్స్ చేసిన ఆస్ట్రేలియా - మళ్లీ రోహిత్ విఫలం
IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ సెంచరీతో (140 రన్స్)తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తలిగింది. మూడు పరుగులు మాత్రమే చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు.
IND vs AUS 4th Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచికొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. 311 పరుగులతో రెండో రోజును కొనసాగించిన ఆస్ట్రేలియాను స్మిత్, కమిన్స్ కలిసి నాలుగు వందల పరుగులు దాటించారు.
68 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ దిగిన స్మిత్ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సెంచరీ చేశాడు. 167 బాల్స్‌లో శతకాన్ని పూర్తిచేశాడు.
34వ సెంచరీ...
స్మిత్ టెస్ట్ కెరీర్‌లో 34వ సెంచరీ ఇది. టీమిండియాపై స్మిత్ పదకొండో సెంచరీ ఇది కావడం గమనార్హం. మరోవైపు కమిన్స్ కూడా ఫోర్లతో టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాఫ్ సెంచరీకి చేరువ అయిన అతడిని జడేజా బోల్తా కొట్టించాడు.
63 బాల్స్‌లో ఏడు ఫోర్లతో కమిన్స్ 49 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన స్మిత్ చివరకు ఆకాష్ దీప్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. 197 బాల్స్‌లో మూడు సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 140 పరుగులు చేశాడు స్మిత్.
బుమ్రాకు నాలుగు వికెట్లు...
122.2 ఓవర్లలో 474 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు, జడేజా మూడు వికెట్లు తీసుకున్నారు. ఆకాష్ దీప్‌కు రెండు, సుందర్‌కు ఓ వికెట్ దక్కింది.
రోహిత్ ఔట్...
ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో టెస్ట్‌లో తిరిగి ఓపెనర్‌గా బరిలో దిగిన రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం జైస్వాల్ 18, కేఎల్ రాహుల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం తొమ్మిది ఓవర్లలో 35 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.