Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ - ఫన్నీగా ఔట్ అయిన స్మిత్ - సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించాలంటూ ట్రోల్స్!
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టిన స్మిత్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. మరోవైపు బాక్సింగ్ డే టెస్ట్‌లో సిరాజ్ ప్రదర్శనపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.
బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించాడు. మూడు టెస్టుల్లో విఫలమైన స్మిత్ కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్‌లో అదరగొట్టాడు. 197 బాల్స్‌లో పదమూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 140 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
స్మిత్ బ్యాడ్‌లక్...
సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచాడు. అతడి జోరు చూసిన అభిమానులు డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ దురదృష్టం స్మిత్‌ను వెంటాడింది. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు స్మిత్ ప్రయత్నించాడు. కానీ మిస్సయిన బాల్ అతడి ప్యాడ్స్‌కు తాకి ఆ తర్వాత మెళ్లగా వెళ్లి వికెట్లకుతగిలింది. బెయిల్స్ కిందపడటంతో స్మిత్ లాంగ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
క్రీజు దాటి ముందుకొచ్చిన స్మిత్ తాను ఓటైన తీరుకు షాకైపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. స్మిత్ ఔట్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
లక్ కలిసిరాకపోతే...
ఈ టెస్ట్‌లో తనకు తానుగానే స్మిత్ ఔటయ్యాడని, లక్ కలిసిరాకపోతే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. కాగా టెస్టుల్లో స్మిత్‌కు ఇది 34వ సెంచరీ కావడం గమనార్హం. భారత్‌పై అతడు చేసిన పదకొండో సెంచరీ ఇది. టీమిండియాపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా బాక్సింగ్ డే టెస్ట్‌తో రికార్డ్ క్రియేట్ చేశాడు.
సిరాజ్ చెత్త రికార్డ్...
బాక్సింగ్ డే టెస్ట్‌లో సిరాజ్ ప్రదర్శనను క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లు వేసిన సిరాజ్ 122 పరుగులు ఇచ్చాడు. 5.30 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. సిరాజ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.
టెస్ట్ జట్టు నుంచి అతడిని తప్పించాలని ట్వీట్లు, కామెంట్స్ పెడుతోన్నారు. ఒక్క వికెట్ కూడా తీయకుండా సెంచరీ పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా సిరాజ్ నిలిచాడని పేర్కొంటున్నారు. బుమ్రా, ఆకాష్ దీప్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ సిరాజ్ బౌలింగ్‌లో మాత్రం అలవోకగా ఫోర్లు కొట్టారు.