Team India: బీజీటీ సిరీస్ లో హయ్యెస్ట్ రన్స్, వికెట్లు తీసింది వీళ్లే - రోహిత్ కంటే బుమ్రానే ఎక్కువ రన్స్ చేశాడుగా!
Team India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున హయ్యెస్ట్ రన్స్ చేసిన క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ 391 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే సాధించాడు. బుమ్రా అత్యధిక వికెట్లు (32) తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Team India: ఆస్ట్రేలియా పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐదో టెస్ట్‌లో టీమిండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా 2014జ-15 తర్వాత మళ్లీ బోర్డర్ గవాస్కర్ సిరీస్ విన్నర్‌గా నిలిచింది. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్నది.
విరాట్ కోహ్లి...రోహిత్ శర్మ...
బౌలింగ్‌లో ఆకట్టుకున్నా...బ్యాటర్లు పూర్తిగా తేలిపోవడంతో టీమిండియాకు దారుణ పరాభవం తప్పలేదు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయారు. కేఎల్ రాహుల్, గిల్, జడేజా కూడా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు.
జైస్వాల్ టాప్ స్కోరర్...
మరోవైపు యంగ్‌స్టర్స్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి చక్కటి పోరాట పఠిమతో ఆకట్టుకున్నారు.
ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. పది ఇన్నింగ్స్‌లలో కలిపి 43. 44 యావరేజ్‌తో 391 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా జైస్వాల్ ఉన్నాడు. 448 పరుగలతో ట్రావిస్ హెడ్ ఫస్ట్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు.
నితీష్ కుమార్...
టీమిండియా తరఫున నితీష్ కుమార్ (298 పరుగులు) సెకండ్ ప్లేస్, కేఎల్ రాహుల్ (276 రన్స్) మూడో స్థానంలో నిలిచారు. రిషబ్ పంత్ 255 రన్స్ (నాలుగో ప్లేస్), విరాట్ కోహ్లి 190 రన్స్‌తో ఐదో స్థానంలో ఉన్నారు.
బుమ్రానే ఎక్కువ...
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అతడి కంటే బుమ్రా (42 రన్స్) ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. ఆకాష్ దీప్ (38 పరుగులు) కూడా రోహిత్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు.
బుమ్రా అత్యధిక వికెట్లు...
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో బుమ్రా అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో హయ్యెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐదు మ్యాచుల్లో కలిసి బుమ్రా 32 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా తర్వాత సిరాజ్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఐదో టెస్ట్‌లో స్థానం దక్కించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఆరు వికెట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆకాష్ దీప్ (ఐదు వికెట్లు), నితీష్ కుమార్ (ఐదు వికెట్లు) ఉన్నారు.
ట్రావిస్ హెడ్...స్మిత్...
మరోవైపు ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ అత్యధిక పరుగులు (414 రన్స్) చేయగా...స్మిత్ (314 పరుగులతో సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు.