IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్: టీమిండియాలో ఓ మార్పు: తుది జట్ల వివరాలివే-ind vs aus 3rd t20 update australia won the toss choose to field against india ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Ind Vs Aus 3rd T20 Update Australia Won The Toss Choose To Field Against India

IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్: టీమిండియాలో ఓ మార్పు: తుది జట్ల వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2023 06:44 PM IST

India vs Australia 3rd T20I: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మొదలైంది. ఈ మ్యాచ్‍లోనూ టాస్ గెలిచాడు ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్. తుదిజట్టులో ఓ మార్పు చేసింది భారత్.

IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్: టీమిండియాలో ఓ మార్పు: తుది జట్ల వివరాలివే
IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్: టీమిండియాలో ఓ మార్పు: తుది జట్ల వివరాలివే (ICC Twitter)

India vs Australia 3rd T20I: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍లో హ్యాట్రిక్ విజయంపై టీమిండియా కన్నేసింది. ఐదు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడో మ్యాచ్‍లోనూ గెలిచి సిరీస్‍ను పక్కా చేసుకోవాలని కసిగా ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ మూడో టీ20 నేడు (నవంబర్ 28) గౌహతి వేదికగా మొదలైంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యు వేడ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది. తుది జట్టులో భారత్ ఓ మార్పు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

గత మ్యాచ్‍తో పోలిస్తే ఈ మూడో టీ20కి తుది జట్టులో ఓ మార్పుతో భారత్ బరిలోకి దిగుతోంది. పేసర్ ముకేశ్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ముకేశ్ కుమార్ పెళ్లి చేసుకోనుండడంతో ఈ మ్యాచ్‍కు దూరమయ్యాడు.

తుది జట్టులో మూడు మార్పులు చేసింది ఆస్ట్రేలియా. ట్రావిస్ హెడ్, బెహరండాఫ్, కేన్ రిచర్డ్ సన్ ఆసీస్ టీమ్‍లోకి వచ్చారు. మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపాకు విశ్రాంతినిచ్చింది ఆస్ట్రేలియా.

ముందుగా బ్యాటింగ్ చేయడం కూడా సంతోషమేనని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో చెప్పాడు. తమకు గేమ్ ప్లాన్ ఉందని అన్నాడు. తుది జట్టులో ఓ మార్పు చేసినట్టు తెలిపాడు. “ముకేశ్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. జీవితంలో అతిపెద్దదైన పెళ్లి అనే మ్యాచ్ ముకేశ్ ఆడనున్నాడు” అని సూర్య చెప్పాడు. త్వరలో వివాహం వల్ల ముకేశ్ జట్టుకు దూరమయ్యాడన్న విషయాన్ని సరదాగా చెప్పాడు సూర్య.

భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా తుదిజట్టు: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోస్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), నాథన్ ఎలిస్, జేసన్ బెహరండాఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్ సన్

WhatsApp channel