IND vs AUS: జైస్వాల్ డకౌట్ - నిరాశపరిచిన కోహ్లి, రోహిత్ - పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియాకు పేలవ ఆరంభం
IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఫస్ట్ మ్యాచ్ హీరోలు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి నిరాశపరిచారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సెకండ్ టెస్ట్‌లో టీమిండియా 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది
IND vs AUS: పింక్‌బాల్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు పేలవ ఆరంభం దక్కింది. అడిలైడ్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ టెస్ట్‌లో టీమిండియా 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ టెస్ట్ హీరోలు కోహ్లి, యశస్వి జైస్వాల్ దారుణంగా నిరాశపరిచారు.
ఫస్ట్ బాల్‌కే...
ఈ సెకండ్ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని రోహిత్ శర్మ త్యాగం చేశాడు. జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తొలి బంతికే టీమిండియాకు షాక్ తగిలింది. తాను ఎదుర్కొన మొదటి బాల్‌కే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యాడు.
గిల్...రాహుల్...
రాహుల్‌తో కలిసి గిల్ టీమిండియా స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. క్రీజుతో పాతుకుపోతున్న టైమ్‌లోనే ఇద్దరు కేవలం ఎనిమిది పరుగులు వ్యవధిలోనే పెవిలియన్ చేరుకున్నారు. రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేశారు. తొలి టెస్ట్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వచ్చి రావడంతోనే ఫోర్ కొట్టి ఊపుమీద కనిపించాడు. ఎనిమిది బాల్స్‌లో ఏడు పరుగులు చేసిన కోహ్లి చెత్త షాట్ ఔట్ నిరాశపరిచాడు. స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
ప్రస్తుతం రిషబ్ పంత్, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి టీమిండియా పరుగులతో ఉంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ పరుగులు చేశారు.
గిల్, అశ్విన్...
ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, దేవ్‌దత్ పడిక్కల్ బదులు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, అశ్విన్ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా టీమ్ హేజిల్‌వుడ్‌ను తప్పించి బోడ్‌మన్‌ను జట్టులోకి తీసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.