IND vs AUS 2nd Test: చేతులెత్తేసిన బ్యాటర్లు - పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఘోర ప‌రాజ‌యం-ind vs aus 2nd test australia best team india by 10 wickets in pink ball test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 2nd Test: చేతులెత్తేసిన బ్యాటర్లు - పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఘోర ప‌రాజ‌యం

IND vs AUS 2nd Test: చేతులెత్తేసిన బ్యాటర్లు - పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఘోర ప‌రాజ‌యం

Nelki Naresh Kumar HT Telugu
Dec 08, 2024 11:14 AM IST

IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ప‌ది వికెట్ల తేడాతో చిత్తుగా ఓట‌మి పాలైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 175 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టీమిండియా విధించిన 19 ప‌రుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఈజీగా ఛేదించింది. మూడు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసింది.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు.ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 180 ర‌న్స్ చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆస్ట్రేలియా ముందు 19 ప‌రుగుల స్వ‌ల్ప టార్గెట్‌ను విధించింది. ఈ ఈజీ టార్గెట్‌ను మూడు ఓవ‌ర్ల‌లోనే ఆస్ట్రేలియా ఛేదించింది.

yearly horoscope entry point

ఐదు వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగుల‌తో మూడో రోజును మొద‌లుపెట్టిన టీమిండియా మ‌రో న‌ల‌భై ఏడు ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన వికెట్ల‌ను కోల్పోయింది.

ఆరంభంలోనే పంత్ ఔట్‌...

128 ప‌రుగుల‌తో మూడో రోజును ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఓవ‌ర్ నైట్ స్కోరుకు ఒక్క ప‌రుగు కూడా జోడించ‌కుండానే రిష‌బ్ పంత్ వెనుదిరిగాడు. 31 బాల్స్‌లో ఐదు ఫోర్ల‌తో 28 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతోన్న ధాటిగా ఆడుతూ టీమిండియాను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు నితీష్ రెడ్డి.

కానీ అత‌డికి మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌లేదు. టెయిలెండ‌ర్లు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. అశ్విన్ (ఏడు ర‌న్స్‌), హ‌ర్షిత్ రాణా (డ‌కౌట్‌) , సిరాజ్ ఏడు ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో జోరు మీదున్న నితీష్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 47 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో న‌ల‌భై రెండు ప‌రుగులు చేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో కూడా నితీష్ టాప్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

కోహ్లి రోహిత్ విఫ‌లం...

ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌తో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కోహ్లి, రోహిత్ దారుణంగా నిరాశ‌ప‌రిచారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క‌మిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా...బోలాండ్ మూడు, స్టార్క్‌కు రెండు వికెట్లు ద‌క్కాయి.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 ప‌రుగులు చేయ‌గా..ఆస్ట్రేలియా 338 ప‌రుగులు చేసింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో తొలి టెస్ట్‌లో టీమిండియా విజ‌యం సాధించింది. రెండో టెస్ట్‌లో విస‌యంతో 1-1తో సిరీస్‌ను ఆస్ట్రేలియా స‌మం చేసింది.

Whats_app_banner