Bumrah Injury: బుమ్రా ఫిట్‌గా ఉంటే 150 టార్గెట్ చాలు - టీమిండియా కెప్టెన్ గాయంపై గవాస్కర్ కామెంట్స్!
Bumrah Injury: ఐదో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ రానున్నట్లు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అన్నాడు.
Bumrah Injury: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ బుమ్రా బౌలింగ్ చేయడం అనుమానంగా మారింది. ఐదో టెస్ట్‌లో రెండో రోజు మ్యాచ్ జరుగుతోన్న టైమ్‌లోనే బుమ్రా హాస్పిటల్‌కు వెళ్లడం అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.
బుమ్రాకు ఏమైందోనని క్రికెట్ అభిమానులు టెన్షన్ పడ్డారు.బుమ్రా గాయంపై టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అప్‌డేట్ ఇచ్చాడు. . బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, స్కానింగ్ కోసమే అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు ప్రసిద్ధ్ కృష్ణ చెప్పాడు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే బుమ్రా గాయంపై క్లారిటీ రానుందని ప్రసిద్ధ్ తెలిపాడు.
బౌలింగ్ అనుమానమే...
బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువ కావడంతోనే అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు చెబుతోన్నారు. బ్యాటింగ్ వరకు ఓకే కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయడం అనుమానమేనని వార్తలు వినిపిస్తోన్నాయి. ఆదివారం బుమ్రా బౌలింగ్ చేసేది లేనిది క్లారిటీ రానున్నట్లు సమాచారం.
32 వికెట్లు...
ఒకవేళ గాయం కారణంగా బుమ్రా బౌలింగ్ చేయలేని పరిస్థితి తలెత్తితే ఐదో టెస్ట్‌లో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్ పరంగా టీమిండియాను బుమ్రానే గట్టెక్కిస్తూ వస్తోన్నాడు. . ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 32 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. ఐదో టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు.
150 కూడా కష్టమే...
బుమ్రా గాయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.బుమ్రా బౌలింగ్ చేయకపోతే టీమిండియా గెలుపు కష్టంగా మారుతుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. బుమ్రా జట్టులో ఉంటే 150 టార్గెట్ కూడా ఆస్ట్రేలియా ఛేదించడం కష్టమే. ఒకవేళ బుమ్రా జట్టులో లేకపోతే 200 లక్ష్యం కూడా సరిపోదు. ఈజీగా ఆస్ట్రేలియా ఛేజ్ చేస్తుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాపై టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో నలభై నుంచి యాభై పరుగులు చేస్తే ఐదో టెస్ట్‌లో టీమిండియా గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ బుమ్రా ఫిట్‌నెస్‌పైనే ఈ విజయం ఆధారపడి ఉంటుంది అని గవాస్కర్ అన్నాడు.
141 పరుగులు
ఐదో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ కాగా..ఆస్ట్రేలియా 181 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది.