ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ను సరికొత్తగా మార్చేందుకు ఐసీసీ చర్యలకు సిద్ధమవుతోంది. జూన్ 2025లో స్టార్ట్ అయ్యే నాలుగో ఎడిషన్ డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐసీసీ కొత్త మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్లో టెస్టు విజయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతోంది.
డబ్ల్యూటీసీ మూడో సైకిల్ ఈ ఏడాది జూన్ 11 నుంచి లార్డ్స్ లో జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇప్పుడున్న పాయింట్ల విధానం ప్రకారం ఓ టెస్టులో గెలిచిన జట్టుకు 12 పాయింట్లు వస్తాయి. మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు దక్కుతాయి. గెలిచిన పాయింట్ల పర్సంటేజీ ప్రకారం టీమ్స్ కు ర్యాంకింగ్స్ ఇస్తారు.
ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం డబ్ల్యూటీసీ నాలుగో ఎడిషన్ పాయింట్ల సిస్టమ్ లో ఐసీసీ మార్పలు చేయబోతుందని తెలిసింది. ముఖ్యంగా విదేశాల్లో జట్టు సాధించే టెస్టు విజయానికి పాయింట్లలో వెయిటేజీ ఇవ్వబోతున్నారని టాక్. అంటే భారత్.. ఆస్ట్రేలియాతో టెస్టు విక్టరీ సాధించే పాయింట్ల వెయిటేజీ దక్కుతుంది. అలాగే టెస్టుల్లో భారీ విజయాలు సాధించినా బోనస్ పాయింట్లు కేటాయించే అవకాశముంది. అంటే 10 వికెట్ల తేడాతో లేదా ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాలు సాధించే జట్లకు బెనిఫిట్ కలిగే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం భారత డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీ, అలాగే ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ లో బోనస్ పాయింట్లు ఇస్తున్నారు. డబ్ల్యూటీసీ లోనూ ఐసీసీ ఈ విధానాన్ని అమలు చేసే అవకాశముంది.
డబ్ల్యూటీసీలో 10 టీమ్స్ మిగతా అన్ని జట్లతో పరస్సరం తలపడవు. కొన్ని జట్లు మాత్రమే సిరీస్ లు ఆడతాయి. అందుకే హోం గ్రౌండ్ అనే అడ్వాంటేజీని తగ్గించేందుకు విదేశాల్లో గెలిచే టెస్టులకు పాయింట్లలో ఎక్కువ వెయిటేజీ ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.
ఈ కొత్త పాయింట్ల వ్యవస్థను ఏప్రిల్‌లో ఐసీసీ సమావేశంలో చర్చించనున్నది. అన్ని జట్లకూ సమాన అవకాశాలు ఉండేలా చూడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్ లో చూస్తే మిగతా టీమ్స్ కంటే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా డబుల్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. అందుకే కొత్త పాయింట్ల సిస్టమ్ తో మార్పులకు ఐసీసీ రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్స్ విధానంపై విమర్శలు వస్తున్నాయి. విదేశాల్లో గెలిచినా.. భారీ విజయాలు సాధించినా ఒకేలా పాయింట్లు కేటాయించడం చర్చకు దారితీసింది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ విధానంపై మండిపడ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ మరింత న్యాయంగా జరగాలని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ కోరాడు.
సంబంధిత కథనం