ICC Test Team of the year: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్.. వన్డే టీమ్‌లో ఒక్కరూ లేరు
ICC Test Team of the year: ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కు చోటు దక్కింది. అయితే వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ లో మాత్రం ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం.
ICC Test Team of the year: ఐసీసీ గతేడాది కోసం టెస్ట్, వన్డే టీమ్స్ ఆఫ్ ద ఇయర్ లను అనౌన్స్ చేసింది. టెస్టు జట్టులో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ స్థానం దక్కించుకున్నా.. వన్డే టీమ్ లో మాత్రం ఒక్కరూ లేరు. టెస్టు జట్టులో మాత్రం ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ రెండు జట్లలో ఏయే ప్లేయర్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం.

ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇదే
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ లో ఏకంగా నలుగురు ఇంగ్లండ్ ప్లేయర్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇండియా నుంచి ముగ్గురికి, న్యూజిలాండ్ నుంచి ఇద్దరికి, ఆస్ట్రేలియా, శ్రీలంకల నుంచి ఒక్కో ప్లేయర్ కు చోటు దక్కింది. శుక్రవారం (జనవరి 24) ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్ ఆఫ్ ద ఇయర్ లను అనౌన్స్ చేసింది.
టెస్టు జట్టులో ఇండియా నుంచి ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేస్ బౌలర్ బుమ్రాకు చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్ నుంచి బెన్ డకెట్, జో రూట్, జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ ఈ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కూడా ఈ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ లో ఉన్నారు.
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్
యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, రవీంద్ర జడేజా, మ్యాట్ హెన్రీ, ప్యాట్ కమిన్స్, కమిందు మెండిస్, బుమ్రా
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్
ఐసీసీ టెస్టు టీమ్ లో ముగ్గురు ఇండియన్స్ కు చోటు దక్కినా.. వన్డే టీమ్ లో మాత్రం ఒక్కరూ లేకపోవడం గమనార్హం. వన్డే టీమ్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల నుంచి ప్లేయర్స్ ఇందులో ఉండటం గమనార్హం. ఇందులో శ్రీలంక, వెస్టిండీస్ టీమ్స్ వచ్చే నెలలో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో లేకపోవడం మరో విశేషం.
ఐసీసీ వన్డే టీమ్ ఇదే
చరిత్ అసలంక, సయిమ్ ఆయుబ్, రహ్మనుల్లా గుర్బాజ్, పథుమ్ నిస్సంక, కుశల్ మెండిస్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, ఏఎం ఘజన్‌ఫర్
సంబంధిత కథనం