ICC Rohit Sharma: హిట్ మ్యాన్ కు సల్మాన్ టైటిల్.. భారత్ కా సికిందర్ రోహిత్ శర్మ.. తప్పు తెలుసుకున్న ఐసీసీ.. పోస్టు వైరల్-icc shares post about rohit sharma instagram bharat ka sikander goes viral salman khan title champions trophy 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rohit Sharma: హిట్ మ్యాన్ కు సల్మాన్ టైటిల్.. భారత్ కా సికిందర్ రోహిత్ శర్మ.. తప్పు తెలుసుకున్న ఐసీసీ.. పోస్టు వైరల్

ICC Rohit Sharma: హిట్ మ్యాన్ కు సల్మాన్ టైటిల్.. భారత్ కా సికిందర్ రోహిత్ శర్మ.. తప్పు తెలుసుకున్న ఐసీసీ.. పోస్టు వైరల్

Chandu Shanigarapu HT Telugu
Published Mar 14, 2025 09:45 AM IST

ICC Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ను ఐసీసీ ప్రశంసల్లో ముంచెత్తింది. భారత్ కా సికిందర్ రోహిత్ అంటూ.. సల్మాన్ ఖాన్ టైటిల్ తో హిట్ మ్యాన్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఇటీవల చేసిన మిస్టేక్ ను ఐసీసీ ఇలా దిద్దుకుందనే చెప్పాలి.

ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ లతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ లతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ICC- X)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను ఐసీసీ ఆకాశానికి ఎత్తేసింది. ‘భారత్ కా సికిందర్’ రోహిత్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలిపిన హిట్ మ్యాన్ కెప్టెన్సీని కొనియాడింది. అయితే కొన్ని రోజుల క్రితం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో రోహిత్ కు చోటు దక్కలేదు. ఈ టోర్నీలో భారత్ ను విజేతగా నిలిపిన రోహిత్ ను కెప్టెన్ గానూ ఎంపిక చేయలేదు. అప్పుడు ఐసీసీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

సికిందర్ క్రేజ్

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజ్ ను వాడుకున్న ఐసీసీ.. రోహిత్ ను ‘భారత్ కా సికిందర్’ అంటూ పేర్కొంది.

'సికిందర్' అని రాసి ఉన్న రోహిత్ యానిమేటెడ్ ఫొటోను ఐసీసీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ తర్వాత హిందీలో 'భారత్ కు చెందిన సికిందర్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.

రోహిత్ హీరోయిజం

ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా భారత్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ హీరోయిజాన్ని ఐసీసీ ఎలివేట్ చేసింది. సికిందర్ కథలో సల్మాన్ పాత్ర సంజయ్ రాజ్ కోట్ హీరోయిజానికి, టోర్నీలో రోహిత్ కెప్టెన్సీకి పోలికలు ఉండటంతో ఈ పోస్టు వైరల్ గా మారింది.

ఆదివారం (మార్చి 9) దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఫైనల్లో రోహిత్ 76 పరుగులతో అదరగొట్టాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఆ జట్టులో

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రకటించిన జట్టులో రోహిత్ పేరు లేకపోవడం విమర్శలకు దారితీసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో హిట్ మ్యాన్ కు చోటు దక్కలేదు.

రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, మిచెల్ శాంట్నర్, మహ్మద్ షమి, మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తితో జట్టును ప్రకటించిన ఐసీసీ.. అక్షర్ ను 12వ ప్లేయర్ గా తీసుకుంది. ఈ టీమ్ కు కివీస్ కు చెందిన శాంట్నర్ ను కెప్టెన్ గా ప్రకటించింది.

తప్పు తెలుసుకొని

రోహిత్ ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో తప్పు తెలుసుకొన్ని ఐసీసీ ఇప్పుడు దిద్దుబాటు చర్యగా రోహిత్ ను సికిందర్ అంటూ పోస్టు చేసిందనే కామెంట్లు వస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ లోనూ రోహిత్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. 2027 వన్డే ప్రపంచకప్ దిశగా రోహిత్ సాగుతున్నాడు.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం