క్రికెట్ మ్యాచుల్లో పట్టే బన్నీ-హోప్స్ క్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బౌండరి లైన్ దాటకుండా గాల్లో పట్టే ఈ క్యాచ్‌లు అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తాయి. అలాగే, మరికొంతమంది ప్రేక్షకులకు అవి అన్యాయంగా కనిపిస్తాయి. అయితే, ఈ బన్నీ హోప్స్ క్యాచ్‌లు ఉండవని తెలుస్తోంది.
క్రికెట్‌లో కొత్త క్యాచ్ నియమాన్ని తీసుకురానున్నాయి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ). దీంతో ఈ నియమాల్లో బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బాల్‌ను పట్టుకునే బన్నీ హోప్స్ క్యాచ్‌లను రద్దు చేస్తున్నారు. వాటిని ఇక నుంచి ఇల్లీగల్‌గా పరిగణిస్తారు.
అయితే, బౌండరీ లోపల నుంచి బాల్‌ను నెట్టి ఆ తర్వాత బయటకు వెళ్లి మళ్లీ తిరిగి డైవ్ చేసి క్యాచ్‌ను పూర్తి చేసేందుకు మాత్రం అనుమతి ఉంది. ఫీల్డరబ్ బంతిని తొలిసారి బౌండరీ వెలుపల నుంచి టచ్ చేస్తే ఆ క్యాచ్ చెల్లాలంటే ఆటగాడు కచ్చితంగా గ్రౌండ్ లోపలికి రావాలి. అంటే, బౌండరీ బయట ఇష్టం వచ్చినన్ని సార్లు బాల్‌ను ఎగరవేయడం ఇక నుంచి కుదరదు.
ఈ కొత్త నియమం ఈ జూన్ నెలలోనే ప్లేయింగ్ కండిషన్‌లో పార్ట్ కానుంది. వచ్చే ఏడాది 2026 అక్టోబర్ నుంచి ఈ నియమాన్ని ఎమ్‌సీసీ అమలు చేయనుంది. అయితే, క్రికెట్ ఆడియెన్స్, అభిమానులకు కొన్ని క్యాచ్‌లు అన్యాయంగా అనిపిస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో ఎమ్‌సీసీ ఈ మార్పు చేసింది.
ప్రస్తుతం ఉన్న నియమం ప్రకారం ఆటగాడు బాల్‌ను, మైదానాన్ని ఒకేసారి బౌండరి బయట తాకితేనే అది చెల్లని క్యాచ్ అవుతుంది. ఈ విషయంపై ఎమ్‌సీసీ కామెంట్స్ చేసింది. "మేము కొత్త నియమాలను రూపొందించాం. వాటి ప్రకారం బన్నీ-హోప్స్ క్యాచ్‌లను రద్దు చేశాం. బౌండరీ లోప నుంచి బాల్‌ను పైకి నెట్టి, బయటకు వెళ్లి ఆ తర్వాత డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది" అని ఎమ్‌సీసీ తెలిపింది.
ఎమ్‌సీసీ ఇంకా కొనసాగిస్తూ "ఒకవేళ బాల్‌ను వేరే ఇతర ఆటగాడికి పంపినా లేదా గ్రౌండ్‌లోకే నెట్టినా ఫీల్డర్ బౌండరీ బయట ల్యాండ్ అయితే లేదా ఆ తర్వాత బయటకు వెళ్తే దాన్ని బౌండరీ కింద పరిగణిస్తారు. అంటే, బౌండరీ బయట నుండి గాల్లోకి ఎగిరి బంతిని తాకడానికి ఆటగాడికి ఒకే ఒక్క అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటి వెళ్లొద్దు" అని చెప్పుకొచ్చింది.
సంబంధిత కథనం