ICC Awards: ఐదు రోజుల పాటు ఐసీసీ అవార్డుల వేడుక - టీమిండియా నుంచి రేసులో ఉన్నది వీళ్లే?
ICC Awards: ఐసీసీ అవార్డుల అనౌన్స్‌మెంట్ డేట్స్ రివీలయ్యాయి. జనవరి 24 నుంచి జనవరి 28 వరకు మొత్తం ఐదు రోజుల పాటు విజేతలను ఐసీసీ ప్రకటించనుంది. ఈ సారి ఐసీసీ అవార్డుల కోసం టీమిండియా నుంచి నలుగురు క్రికెటర్లు పోటీపడుతోన్నారు.
ICC Awards: ఐసీసీ అవార్డుల అనౌన్స్‌మెంట్ డేట్స్ వచ్చేశాయి. ఫార్మేట్ల వారీగా మొత్తం ఐదు రోజుల పాటు అ అవార్డులను ప్రకటించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. జనవరి 24 (నేటి ) నుంచి జనవరి 28 వరకు అవార్డుల అనౌన్స్‌మెంట్ వేడుక జరుగునుంది. 2024 ఏడాదిలో వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో పాటు టీమ్‌లకు అవార్డులను అందజేయబోతున్నారు

జనవరి 24న మెన్స్, ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ తో పాటు మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అనౌన్స్‌చేయబోతున్నారు.
టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్...
జనవరి 25న మెన్స్ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌తో పాటు ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల విజేతలు ఎవరన్నది తెలియనుంది.
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్...
జనవరి 26న మెన్స్, ఉమెన్స్ విభాగాలకు సంబంధించి ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విన్నర్స్‌ను ప్రకటించనున్నారు. వీటితో అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో పురుష, మహిళల జట్లకు సంబంధించి వేర్వేరుగా అవార్డులను అందజేయనున్నారు అంపైర్ ఆఫ్ ది ఇయర్ ఎవరన్నది ఆ రోజే రివీల్ అవుతుంది.
జనవరి 27న వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఎవరు గెలుచుకున్నారన్నది వెల్లడికానుంది. జనవరి 28న రాచెల్ ఫ్లింట్ ట్రోఫీ, గ్యారీ సోబర్స్ ట్రోఫీ విన్నర్స్‌ను ఐసీసీ వెల్లడించనుంది.
టీమిండియా నుంచి
ఈ సారి ఐసీసీ అవార్డుల రేసులో టీమిండియా నుంచి నలుగురు క్రికెటర్లు నిలిచారు. ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో బుమ్రా నిలిచాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో బుమ్రాతో పాటు ఆస్ట్రేలియన్ హిట్టర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్ క్రికెటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ ఉన్నారు. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా బుమ్రా నామినేట్ అయ్యాడు.
టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ - 20 క్రికెటర్ ఆఫ్ ది ఆయర్ అవార్డు, స్మృతి మంథన - ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, శ్రేయాంక పాటిల్ - ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల రేసులో నిలిచారు
టాపిక్