Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. బుమ్రా ఔట్.. యంగ్ బౌలర్‌కు ప్లేస్.. మరో ఛేంజ్-huge set back for team india as jasprit bumrah ruled out from champions trophy 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. బుమ్రా ఔట్.. యంగ్ బౌలర్‌కు ప్లేస్.. మరో ఛేంజ్

Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. బుమ్రా ఔట్.. యంగ్ బౌలర్‌కు ప్లేస్.. మరో ఛేంజ్

Jasprit Bumrah - Champions Trophy 2025: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రిప్లేస్‍మెంట్‍ను ప్రకటించింది. జట్టులో మరో మార్పు కూడా జరిగింది.

Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బుమ్రా ఔట్.. యంగ్ బౌలర్‌కు ప్లేస్.. మరో ఛేంజ్ (AFP)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా టోర్నీకి గాయం వల్ల దూరమయ్యాడు. గత నెల ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్ను గాయానికి గురయ్యాడు బుమ్రా. ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు దూరమయ్యయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా ఔట్ అయ్యాడు. పూర్తి ఫిట్‍నెస్ సాధించని కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

బుమ్రా స్థానంలో హర్షిత్

బుమ్రా స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో యంగ్ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ తీసుకుంది. “ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు దూరమయ్యాడు. బుమ్రాకు రిప్లేస్‍మెంట్‍గా హర్షిత్ రాణాను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది” అని బీసీసీఐ వెల్లడించింది.

12 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలువాలని కసిగా ఉన్న భారత్‍కు బుమ్రా దూరమవడం పెద్ద దెబ్బగా మారింది. అద్భుత ఫామ్‍లో ఉన్న అతడు లేకపోవడం లోటుగా కనిపించనుంది. 2022, 2013ల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది భారత్.

జైస్వాల్ ఔట్.. వరుణ్‍కు చోటు

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత జట్టులో మరో మార్పు కూడా జరిగింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‍ను తప్పించి మంచి ఫామ్‍లో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చారు సెలెక్టర్లు. టీ20ల్లో వరుణ్ కొంతకాలం అద్భుత ఫామ్‍లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‍తో సిరీస్‍లో వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.

అద్బుత ప్రదర్శనతో మిస్టరీ సిన్నర్‌గా పేరుతెచ్చుకున్న వరుణ్‍కు ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కింది. “వరుణ్ చక్రవర్తి.. టీమిండియాలో యాడ్ అయ్యాడు. యశస్వి జైస్వాల్‍ను అతడు రిప్లేస్ చేస్తాడు” అని బీసీసీఐ పేర్కొంది. కాగా, ఈ టోర్నీకి నాన్ ట్రావెలింగ్ సబ్‍స్టిట్యూట్లుగా జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివం దూబే ఉన్నారు. అవసరమైతే వారు దుబాయ్‍కు ట్రావెల్ చేస్తారని బీసీసీఐ పేర్కొంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఈనెల ఫిబ్రవరి 19న మొదలుకానుంది. భారత్ ఆడే అన్ని మ్యాచ్‍లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. మిగిలిన మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో సాగుతాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీలో పోరును భారత్ షురూ చేయనుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. మార్చి 2న న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడనుంది. సెమీస్, ఫైనల్‍కు క్వాలిఫై అయితే వాటిని కూడా దుబాయ్‍లోనే భారత్ ఆడుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం