Pak in Loss: పరువు పోయింది.. పైసా పోయింది.. ఒక్క మ్యాచ్ ఆడటానికి రూ.869 కోట్లు ఖర్చు.. నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్-huge set back for pakistan cricket board big 85 loss as champions trophy host rs 869 crores for one match pcb ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pak In Loss: పరువు పోయింది.. పైసా పోయింది.. ఒక్క మ్యాచ్ ఆడటానికి రూ.869 కోట్లు ఖర్చు.. నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్

Pak in Loss: పరువు పోయింది.. పైసా పోయింది.. ఒక్క మ్యాచ్ ఆడటానికి రూ.869 కోట్లు ఖర్చు.. నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్

Pak in Loss: పట్టుబట్టి మరీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయింది. పేరుకే గొప్పగా నిర్వహించామని చెప్పుకున్న పీసీబీ.. ఇప్పుడు ఆటగాళ్లకు మనీ ఇచ్చే పొజిషనల్ లేకుండా పోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ ఆడిన పాకిస్థాన్ (AP)

గత 29 ఏళ్లలో పాకిస్థాన్ తొలిసారి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ఇటీవల నిర్వహించింది. ఈ టోర్నీతో దేశంలో క్రికెట్ కు తిరిగి వైభవం దక్కుతుందని భావించింది. విదేశీ జట్లు సిరీస్ ల కోసం పాక్ కు క్యూ కడతాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుకుంది. కానీ కట్ చేస్తే.. చివరకు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఈ టోర్నీ నిర్వహణతో పీసీబీకి 85 శాతం లాస్ వచ్చింది.

రూ.869 కోట్లు

ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పీసీబీ పెట్టిన ఖర్చు భారత కరెన్సీలో రూ.869 కోట్లు. ఇంత డబ్బు పెట్టి పాక్ సొంతగడ్డపై ఆడని మ్యాచ్ లు ఎన్నో తెలుసా? కేవలం ఒక్కటంటే ఒకటే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫస్ట్ మ్యాచ్ లో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో న్యూజిలాండ్ తో పాక్ తలపడింది. ఈ మ్యాచ్ లో పాక్ చిత్తయింది. ఆ తర్వాత భారత్ తో పోరు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడా చిత్తుచిత్తుగా ఓడింది. ఆ తర్వాత రావల్పిండిలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో ఒక్క విజయం లేకుండానే పాక్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మూడు గ్రౌండ్ లు

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం కోసం రావల్పిండి, లాహోర్, కరాచీలోని మూడు స్టేడియాలను పీసీసీ అప్ గ్రేడ్ చేసింది. దీని కోసం సుమారు 58 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది పీసీబీ బడ్జెట్ కంటే 50 శాతం ఎక్కువ. అంతేకాకుండా ఈవెంట్ సన్నాహాల కోసం 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. కానీ హోస్టింగ్ ఫీజు, టికెట్ అమ్మకాలు, స్పాన్సర్ల నుంచి వచ్చిన డబ్బు 6 మిలియన్ డాలర్లు మాత్రమే. పీసీబీకి దాదాపు 85 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

ఆటగాళ్లకు షాక్

అసలే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో లాస్, పైగా ఆర్థిక సంక్షోభం.. దీంతో ఆటగాళ్లకు పీసీబీ షాకిస్తోంది. దేశవాళీ టోర్నీలో ప్లేయర్స్ కు చెల్లించే మ్యాచ్ ఫీజును ఏకంగా 90 శాతం కట్ చేసింది. రిజర్వ్ ప్లేయర్ చెల్లింపులను 87.5 శాతం తగ్గించింది. దీంతో ఆటగాళ్లు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఫైవ్ స్టార్ హోటల్స్ కాకుండా క్రికెటర్లను సాధారణ హోటల్లలో ఉంచుతున్నారు. కానీ పీసీబీ అధికారులు మాత్రం లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.

పీసీబీ ఇటీవల మ్యాచ్ ఫీజును రూ.40,000 నుంచి రూ.10,000కు తగ్గించిందని పాకిస్థాన్ జాతీయ దినపత్రిక డాన్ పేర్కొంది. అయితే పీసీబీ చైర్మన్ మోహిన్ నఖ్వీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించారు. సవరించిన మొత్తాన్ని పీసీబీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ప్రతి మ్యాచ్ కు రూ.30,000 గా నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం