hotstar: హాట్ స్టార్ కు ఏమైంది? ఫ్యాన్స్ ఫైర్.. హిందీలోనే కామెంటరీ.. పూర్ వీడియో క్వాలిటీ
hotstar: అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ను స్ట్రీమ్ చేస్తున్న హాట్ స్టార్ టెక్నికల్ ఫెయిల్యూర్ ను ఫేస్ చేస్తోంది. కేవలం హిందీలోనే కామెంటరీ వస్తుండటం, వీడియో క్వాలిటీ పూర్ గా ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడో వన్డేను ప్రసారం చేసే డిజిటిల్ స్ట్రీమింగ్ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డౌన్ అయింది. కేవలం హిందీలోనే కామెంటరీ వస్తోంది. లాంగ్వేజ్ ఛేంజ్ చేసుకునే ఆప్షన్ పని చేయడం లేదు. అలాగే వీడియో క్వాలిటీ పూర్ గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా ఛేంజ్ చేసే ఆప్షన్ పని చేయడం లేదు.
ఫ్యాన్స్ ఫైర్
అహ్మదాబాద్ లో మూడో వన్డే కోసం భారత ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కోహ్లి ఫామ్ లోకి వస్తే చూడాలని కోరుకున్నారు. తీరా మ్యాచ్ టైం వచ్చేసరికి మొదట హాట్ స్టార్ డౌన్ అయింది. ఆ తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కేవలం హిందీలోనే వస్తుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు తదితర రీజినల్ లాంగ్వేజెస్ ఛేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కోహ్లి హాఫ్ సెంచరీని తమకు నచ్చిన లాంగ్వేజ్ లో, హై క్లారిటీ వీడియో క్వాలిటీతో సెలబ్రేట్ చేసుకుందామంటే నిరాశే ఎదురైంది.
సోషల్ మీడియాలో పోస్ట్ లు
హాట్ స్టార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంత సేపు అయినా కానీ ప్రాబ్లం సాల్వ్ చేయడం లేదని మండిపడుతున్నారు. హాట్ స్టార్ ను అన్ ఇన్ స్టాల్ చేయాలని పిలుపునిస్తున్నారు. కోహ్లి హాఫ్ సెంచరీని మంచి వీడియో క్వాలిటీతో చూడలేకపోతున్నామని మండిపడుతున్నారు. శుభ్ మన్ మెరుపు ఇన్నింగ్స్ మజాను ఆస్వాదించలేకపోతున్నామన్నారు.