Ashwin: హిందీ మన జాతీయ భాషకాదు - అశ్విన్ కామెంట్స్ వైరల్
Ashwin: చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదంటూ కామెంట్స్ చేశాడు. అశ్విన్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అశ్విన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుపడుతోండగా...మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తోన్నారు.
Ashwin: ఇటీవలే రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ అశ్విన్ వార్తల్లో నిలిచాడు. హిందీ భాష గురించి అతడు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీ గ్రాడ్యూయేషన్ వేడుకకు అశ్విన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ వేడుకలో హిందీ మన జాతీయ భాష కాదంటూ అశ్విన్ అనడం హాట్ టాపిక్‌గా మారింది.
అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే...
ఈ వేడుకలో అశ్విన్ మాట్లాడేముందు ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఎంత మందికి అర్థమవుతుంది అంటూ స్టూడెంట్స్‌ను అడిగాడు అశ్విన్. తమిళంతో పాటు ఇంగ్లీష్ అర్థమవుతుందని చాలా మంది స్టూడెంట్స్ చేతులు ఎత్తారు. హిందీ భాష గురించి అశ్విన్ అడిగినప్పుడు కొందరు స్టూడెంట్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ రెస్పాన్స్ చూసిన అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదు...కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే అని అన్నాడు. హిందీ భాష గురించి అశ్విన్ కామెంట్స్‌ను అభిమానులు ట్రోల్ చేస్తోన్నారు. తమిళనాడు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తోన్నారు.
హర్డ్ వర్క్‌తోనే...
ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి క్రికెటర్‌గా మారడంపై ఈ వేడుకలో అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెటర్ రాణించలేనని ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు చాలా మంది అన్నారని, హార్డ్‌వర్క్‌తో వారికి సమాధానం చెప్పానని అశ్విన్ అన్నాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే కొత్త విషయాల్ని ఎప్పుడూ తెలుసుకోవడం అలవచ్చుకున్నానని, నేర్చుకోవడం ఆపేసిన రోజు మన ఎదుగుదల అన్నది ఆగిపోతున్నది అశ్విన్ చెప్పాడు.
రిటైర్‌మెంట్...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్‌లో కేవలం రెండో టెస్ట్ మాత్రమే ఆడాడు అశ్విన్. ఈ టెస్ట్ ముగిసిన వెంటనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ నిర్ణయం క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులను షాకింగ్‌కు గురి చేసింది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐపీఎల్‌లో మాత్రం కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన మెగావేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.