AUS vs SA: 83 బాల్స్‌లో 174 ర‌న్స్ - 13 సిక్స‌ర్ల‌తో ఆసీస్‌కు చుక్క‌లు చూపించిన క్లాసెన్-heinrich klaasen smashes record century south africa set 417 target against australia in 4th odi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Aus Vs Sa: 83 బాల్స్‌లో 174 ర‌న్స్ - 13 సిక్స‌ర్ల‌తో ఆసీస్‌కు చుక్క‌లు చూపించిన క్లాసెన్

AUS vs SA: 83 బాల్స్‌లో 174 ర‌న్స్ - 13 సిక్స‌ర్ల‌తో ఆసీస్‌కు చుక్క‌లు చూపించిన క్లాసెన్

HT Telugu Desk HT Telugu

AUS vs SA: ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న నాలుగు వ‌న్డేలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ హెన్రీచ్ క్లాసెన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 83 బాల్స్‌లో 13 సిక్స‌ర్లు, 13 ఫోర్ల‌తో 174 ర‌న్స్ చేశాడు. క్లాసెన్‌తో పాటు మిల్ల‌ర్ కూడా బ్యాట్ ఝులిపించ‌డంతో సౌతాఫ్రికా 50 ఓవ‌ర్ల‌లో 416 ర‌న్స్ చేసింది.

క్లాసెన్

AUS vs SA: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 83 బాల్స్‌లోనే 174 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ 13సిక్స‌ర్ల‌తో పాటు 13 ఫోర్లు కొట్టాడు. అత‌డి సుడిగాలి ఇన్నింగ్స్‌తో యాభై ఓవ‌ర్ల‌లో సౌతాఫ్రికా 416 ప‌రుగులు చేసింది. క్లాసెన్‌తో పాటు డేవిడ్ మిల్ల‌ర్ కూడా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.

45 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, ఆరు ఫోర్ల‌తో 85 ర‌న్స్ చేశాడు. క్లాసెన్‌, మిల్ల‌ర్ క‌లిసి 15 ఓవ‌ర్ల‌లోనే 222 ప‌రుగులు చేశారు. 34 ఓవ‌ర్ల‌లో 194 ప‌రుగులు చేసిన సౌతాఫ్రికా 300 ప‌రుగులు కూడా చేస్తుందా లేదా అనిపించింది. కానీ క్లాసెన్ రాక‌తో సీన్ మొత్తం రివ‌ర్సైంది. ఫ‌స్ట్ బాల్ నుంచే ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగిన క్లాసెన్ ఎడాపెడా సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

ఏకంగా 13 సిక్స‌ర్ల‌తో పాటు 13 ఫోర్లు కొట్టాడు. 174 ప‌రుగుల్లో ఫోర్లు, సిక్స‌ర్ల వాటా 130 ప‌రుగులు కావ‌డం గ‌మ‌నార్హం. క్లాసెన్‌, మిల్ల‌ర్ ధాటికి ఆసీస్ స్పిన్స‌ర్ ఆడ‌మ్ జంపా దారుణంగా బ‌ల‌య్యాడు. 10 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ కూడా తీయ‌కుండా 113 ప‌రుగులు ఇచ్చి చెత్త రికార్డ్‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. నీస‌ర్ మిన‌హా మిగిలిన ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను క్లాసెన్‌, మిల్ల‌ర్ ఆట ఆడుకున్నారు. వ‌న్డేల్లో సౌతాఫ్రికాకు ఇది నాలుగో అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం.