Shreyanka Patil: కోహ్లికి నా పేరు తెలుసు - డబ్ల్యూపీఎల్ స్టార్ శ్రేయాంక పాటిల్ ట్వీట్ వైరల్
Shreyanka Patil: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచిన ఆర్‌సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్...విరాట్ కోహ్లిని కలిసింది. కోహ్లి తన రోల్ మోడల్ అంటూ శ్రేయాంక ట్వీట్ చేసింది.
Shreyanka Patil: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్పిన్ మెరుపులతో సత్తా చాటింది శ్రేయాంక పాటిల్. ఈ లీగ్ ద్వారా క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలైన శ్రేయాంక పాటిల్ తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని కలిసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్రేయాంక వెల్లడించింది.
కోహ్లితో ఫొటో...
కోహ్లితో కలిసి దిగిన ఫొటోను శ్రేయాంక పాటిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కోహ్లి వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని శ్రేయాంక తెలిపింది. క్రికెట్ ఆటపై ఇష్టం పెరగడానికి కారణం కోహ్లినేనని వెల్లడించింది. కోహ్లి మాదిరిగా గొప్ప క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కంటూ జీవితంలో ముందుకు సాగానని శ్రేయాంక చెప్పింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనా బౌలింగ్ బాగుందని కోహ్లి మెచ్చుకున్నాడని శ్రేయాంక అన్నది. కోహ్లికి నా పేరు తెలుసు అంటూ శ్రేయాంక ఈ ట్వీట్‌లో పేర్కన్నది. కోహ్లికి తాను ఎప్పటికీ ఫ్యాన్‌నే అంటూ హ్యాష్‌ట్యాగ్ జోడించింది. అంతే కాకుండా కోహ్లి తన రోల్‌మోడల్ అని చెప్పింది. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లి అభిమానులతో క్రికెట్ ఫాన్స్ శ్రేయాంక ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు.
పర్పుల్ క్యాప్ విన్నర్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది శ్రేయాంక పాటిల్. డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్‌ను ఆర్‌సీబీ గెలవడంతో శ్రేయాంక కీలక పాత్ర పోషించింది. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచుల్లో 13వికెట్ల తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచింది.
ఫైనల్‌లో నాలుగు వికెట్లు...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో శ్రేయాంక 3.3 ఓవర్లు వేసిన శ్రేయాంక కేవలం పన్నెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నది. శ్రేయాంక దెబ్బకు ఢిల్లీ 18 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. సింపుల్ టార్గెట్‌ను ఛేదించిన బెంగళూరు తొలిసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్నది. డబ్ల్యూపీఎల్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా శ్రేయాంక పాటిల్‌కే దక్కింది.
కరేబియన్ లీగ్‌లో...
గత ఏడాది కరేబియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడింది శ్రేయాంక. ఈ లీగ్‌లో ఇండియన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కరేబియన్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ టీమ్ తరఫున బరిలో దిగింది. 9 వికెట్లతో ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పింది. 2023లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రేయాంక పాటిల్.