బారత్ వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజీ మ్యాచ్ లో హార్దిక్ సెండాఫ్ వైరల్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఆదివారం (ఫిబ్రవరి 23) జరుగుతున్న ఈ మ్యాచ్ లో బాబర్ ను హార్దిక్ ఔట్ చేశాడు. ఆ వెంటనే చేయి ఊపుతూ బై బై అంటూ సాగనంపాడు. దీనికి బాబర్ ఇచ్చిన రియాక్షన్ కూడా వైరల్ గా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ గా వచ్చిన బాబర్ ఆజం మంచి టచ్ లో కనిపించాడు. 24 బంతుల్లో అయిదు ఫోర్లతో 23 పరుగులు చేశాడు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ తొలి బంతికి బాబర్ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి కవర్ డ్రైవ్ ఆడదామని చూడగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది.
బాబర్ వికెట్ పడగానే హార్దిక్ చేయి ఊపుతూ సెండాఫ్ ఇచ్చాడు. బైబై అనేలా సాగనంపాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హార్దిక్ సెండాఫ్ కు బాబర్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్ ను ఈ మ్యాచ్ తో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌటయ్యాడు.