Harbhajan on Chahal: వరల్డ్ కప్ టీమ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో చాహల్ బెస్ట్ - హర్భజన్ కామెంట్స్ వైరల్
Harbhajan on Chahal: వరల్డ్ కప్‌లోపు అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోకపోతే అతడి స్థానంలో ఎవరిని ఎంపికచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అక్షర్ స్థానంలో చాహల్‌ను తీసుకోవడం బెస్ట్ అని టీమిండియా మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ తెలిపాడు.
Harbhajan on Chahal: వరల్డ్ కప్ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానాన్ని దక్కించుకున్నాడు. కానీ ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా అతడు గాయపడటంతో అక్షర్ పటేల్ వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అక్షర్ పటేల్ కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం అక్షర్ పటేల్ గాయపడటంతో అతడి స్థానంలో అశ్విన్, సుందర్‌లను తీసుకున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. వరల్డ్ కప్ లోగా అక్షర్ కోలుకోకపోతే వారిలో అతడి స్థానాన్ని అశ్విన్‌తోనే రీప్లేస్ చేసే అవకాశం ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అక్షర్ పటేల్ వరల్డ్ కప్ లోగా కోలుకోకపోతే అతడి స్థానంలో చాహల్ బెస్ట్ ఆప్షన్ అని టీమీండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చాహల్ మ్యాచ్ విన్నర్ అని హర్భజన్ సింగ్ తెలిపాడు. చాహల్ ప్రతిభను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అతడు ఎంత విలువైన ఆటగాడన్నది అనేక సార్లు తన బౌలింగ్‌తోనే చాహల్ నిరూపించి చూపించాడని హర్భజన్ సింగ్ చెప్పాడు.
వరల్డ్ కప్ కోసం అక్షర్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాల్సివస్తే చాహల్ బెస్ట్ అని హర్భజన్ సింగ్ తెలిపాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. టీమ్ ఇండియా తరఫున జూన్‌లో చివరి వన్డే ఆడాడు చాహల్. ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్‌లోనూ అతడికి చోటు దక్కలేదు