మరికొన్ని గంటల్లో వుమెన్స్ ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 స్టార్ట్ కాబోతుంది. గత రెండు సీజన్లుగా తమ ఆటతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసిన అమ్మాయిలు మరోసారి సత్తాచాటేందుకు ఫీల్డ్ లో దిగబోతున్నారు. అయిదు జట్లు టైటిల్ కోసం ఢీ కొట్టబోతున్నాయి. ఈ సారి నాలుగు స్టేడియాల్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు టీ20 క్రికెట్ తో డబ్ల్యూపీఎల్ అలరించబోతోంది.
డబ్ల్యూపీఎల్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అమ్మాయిల కూడా టీ20 క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతున్న సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్ తో సెలబ్రేట్ చేస్తోంది. వుమెన్స్ ప్రిమియర్ లీగ్ 2025 బిగిన్స్ అనే క్యాప్షన్ తో డూడుల్ లోగోను క్రియేట్ చేసింది.
డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ లో ముంబయి ఇండియన్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడింది. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. కెప్టెన్ గా మంధాన జట్టను గెలిపించింది. ఐపీఎల్ లో పురుషుల ఆర్సీబీ జట్టుకు సాధ్యం కాని దాన్ని డబ్ల్యూపీఎల్ లో అమ్మాయిలు అందుకున్నారు. మరి ఈ సీజన్లో టైటిల్ ఎవరు కొడతారన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.
డబ్ల్యూపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో గుజరాత్ జెయింట్స్ తలపడుతోంది. వడోదరలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఒక్కోసారి టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ట్రోఫీ వేటకు సిద్ధమయ్యాయి.
సంబంధిత కథనం