Gautam Gambhir: పాలిటిక్స్‌కు గౌత‌మ్‌ గంభీర్ గుడ్‌బై - ఐపీఎల్ కోస‌మేనా? - ట్వీట్ వైర‌ల్‌-gautam gambhir to relieve from politics for cricket team india former cricketer tweet viral ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Gautam Gambhir To Relieve From Politics For Cricket Team India Former Cricketer Tweet Viral

Gautam Gambhir: పాలిటిక్స్‌కు గౌత‌మ్‌ గంభీర్ గుడ్‌బై - ఐపీఎల్ కోస‌మేనా? - ట్వీట్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 02, 2024 11:18 AM IST

Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెట‌ర్ గంభీర్ సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకున్నాడు. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్ కోస‌మే రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్న‌ట్లు శ‌నివారం ట్వీట్ చేశాడు.

గౌత‌మ్ గంభీర్
గౌత‌మ్ గంభీర్

Gautam Gambhir: గౌత‌మ్ గంభీర్ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాడు. త‌న‌కు ఇష్ట‌మైన క్రికెట్ కోసం రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్న‌ట్లు శ‌నివారం గంభీర్ ప్ర‌క‌టించాడు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను ట్యాగ్ చేస్తూ గంభీర్ ట్వీట్ చేశాడు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని మోడీతో పాటు అమిత్ షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. గౌత‌మ్‌ గంభీర్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. అత‌డి ట్వీట్ క్రికెట్‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

2019 ఎన్నిక‌ల్లో...

2019లో అరుణ్ జైట్లీ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు గౌత‌మ్‌ గంభీర్‌. అదే ఎడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు గంభీర్‌. ఈ సారి ఎంపీ ఎలెక్ష‌న్స్‌లో గౌత‌మ్ గంభీర్ పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే గంభీర్‌ రాజ‌కీయాల నుంచి వైదొలిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గంభీర్‌కు టికెట్ ఇవ్వ‌డానికి బీజేపీ కూడా ఆస‌క్తిని చూప‌డం లేద‌ని అంటున్నారు. గంభీర్ స్థానంలో మ‌రొక‌రికి ఈస్ట్ ఢిల్లీ టికెట్ కేటాయించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ కోస‌మేనా...

ఐపీఎల్ కోస‌మే గంభీర్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు గంభీర్ మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. గంభీర్ త‌మ టీమ్‌కు మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యాన్ని కోల్‌క‌తా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఐపీఎల్ 2022, 23 సీజ‌న్స్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్‌కు గంభీర్ మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ల‌క్నోకు గుడ్‌బై చెప్పిన గంభీర్ ఈ ఏడాది సొంత గూటికి వ‌చ్చేశాడు.

కోల్‌క‌తాకు కెప్టెన్‌గా...

ఒక‌ప్పుడు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన గంభీర్ ఇప్పుడు అదే జ‌ట్టుకు మెంట‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నాడు. 2011 నుంచి 2017 వ‌ర‌కు ఏడేళ్ల పాటు కోల్‌క‌తా జ‌ట్టుకు కెప్టెన్‌గా గంభీర్ కొన‌సాగాడు. గంభీర్ సార‌థ్యంలో కోల్‌క‌తా ఐపీఎల్‌లో అద్భుత‌మైన విజ‌యాల్ని అందుకున్న‌ది. 2012, 2014లో కోల్‌క‌తాకు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. ఐపీఎల్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రించాడు.

టీమిండియా త‌ర‌ఫున‌...

ఐపీఎల్‌లో మొత్తం 154 మ్యాచ్‌లు ఆడిన గంభీర్ 4217 ర‌న్స్ చేశాడు. 2018 ఐపీఎల్‌లో విఫ‌ల‌మైన గంభీర్ ఆ త‌ర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా త‌ర‌ఫున 147 వ‌న్డేలు ఆడిన గంభీర్‌5238 ర‌న్స్ చేశాడు. 11 సెంచ‌రీలు చేశాడు. 58 టెస్ట్‌ల‌లో 4154 ప‌రుగులు సాధించాడు. 37 టీ20ల‌లో టీమిండియా ప్రాతినిథ్యం వ‌హించిన గంభీర్ 932 ప‌రుగులు చేశాడు.

మార్చి 22 నుంచి...

ఐపీఎల్ 2024 సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కాబోతోంది. మే 26న ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డ‌బోతున్న‌ది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌దిహేను రోజుల షెడ్యూల్‌ను మాత్ర‌మే ఐపీఎల్ యాజ‌మాన్యం. మిగిలిన షెడ్యూల్‌ను ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point