Gautam Gambhir: అప్పుడు కెప్టెన్ - ఇప్పుడు మెంట‌ర్ - తిరిగి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ గూటికే చేరిన గంభీర్‌-gautam gambhir appointed as mentor of kolkata knight riders for ipl 2024 ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Gautam Gambhir Appointed As Mentor Of Kolkata Knight Riders For Ipl 2024

Gautam Gambhir: అప్పుడు కెప్టెన్ - ఇప్పుడు మెంట‌ర్ - తిరిగి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ గూటికే చేరిన గంభీర్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 22, 2023 01:23 PM IST

Gautam Gambhir: ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్‌కు గౌత‌మ్ గంభీర్ మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. గంభీర్ మెంట‌ర్‌గా నియ‌మితుడైన విష‌యాన్ని కోల్‌క‌తా యాజ‌మాన్యం ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

గౌత‌మ్ గంభీర్
గౌత‌మ్ గంభీర్

Gautam Gambhir: ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుకు గౌత‌మ్ గంభీర్ మెంట‌ర్‌గా బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యాన్ని కోల్‌క‌తా యాజ‌మాన్యం ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. వెల్‌క‌మ్ హోమ్...మెంటర్ గౌత‌మ్ గంభీర్ అంటూ ట్వీట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

23వ నంబ‌ర్ జెర్సీతో గంభీర్ వెన‌క్కి తిరిగి ఉన్న ఓ ఫొటోను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ టీమ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. గంభీర్ కూడా ఇదే ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఐ యామ్ బ్యాక్‌...ఐ యామ్ హంగ్రీ...ఐ యామ్ నంబ‌ర్ 23 అంటూ ట్వీట్ చేశాడు. కోల్‌క‌తా కెప్టెన్ గంభీర్ మ‌రో కొత్త అవ‌తారంలో మెంట‌ర్‌గా జ‌ట్టులో భాగం కావ‌డం ఆనందంగా ఉంద‌ని కేకేఆర్ ఓన‌ర్ షారుఖ్‌ఖాన్ తెలిపాడు.

నెక్స్ట్ సీజ‌న్‌లో మెంట‌ర్‌గా గంభీర్ చేసే మ్యాజిక్ చూసేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అంటూ షారుఖ్ ఖాన్ తెలిపాడు. నైట్‌రైడ‌ర్స్ టీమ్‌కు 2011 నుంచి 2017 వ‌ర‌కు గౌత‌మ్ గంభీర్ కెప్టెన్‌గా కొన‌సాగాడు. అత‌డి సార‌థ్యంలో కోల్‌క‌తా టీమ్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచింది. 2023 ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు గంభీర్ మెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ల‌క్నో టీమ్‌కు రాజీనామా చేసి తిరిగి కేకేఆర్ గూటికి చేరుకున్నాడు గంభీర్‌.

WhatsApp channel