ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ఫ్రీగా చూడాలా?.. జియో ప్లాన్స్ ఇవే.. ఓ లుక్కేయండి!-free ipl 2025 on jiohotstar look at these jio plans season to resume on may 17th ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ఫ్రీగా చూడాలా?.. జియో ప్లాన్స్ ఇవే.. ఓ లుక్కేయండి!

ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ఫ్రీగా చూడాలా?.. జియో ప్లాన్స్ ఇవే.. ఓ లుక్కేయండి!

ఐపీఎల్ 2025 సీజన్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతోంది. ఇంకో రెండు రోజులే. మే 17న సీజన్ పున:ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లను జియోహాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చు. మరి ఆ జియో ప్లాన్స్ ఏంటో ఇక్కడ ఓ లుక్కేయండి.

విరాట్ కోహ్లి (PTI)

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 18వ సీజన్ ను మధ్యలో వారం పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ సీజన్ తిరిగి స్టార్ట్ కాబోతోంది. శనివారం (మే 17) సీజన్ రీస్టార్ట్ అవుతోంది. మరి ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను జియోహాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ జియో ప్లాన్స్ చూసేయండి. వీటితో ఐపీఎల్ ను ఫ్రీగా చూడొచ్చు.

17 మ్యాచ్ లు

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇంకా పదిహేడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఆదివారాల్లో రెండు డబుల్ హెడర్లు, ప్లేఆఫ్స్ ఉన్నాయి. మే 29న క్వాలిఫైయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్ 2, జూన్ 3న ఫైనల్ జరుగుతుంది.

ఈ ఏడాది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్‌స్టార్‌ కలిగి ఉంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కోసం దీన్ని సులువు చేసేందుకు జియో నెట్ వర్క్ అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది.

  1. జియో యాడ్-ఆన్ ప్లాన్ (రూ. 100): ఇప్పటికే జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదనపు డేటా, ఐపీఎల్ స్ట్రీమింగ్ ను కోరుకునే వాళ్ల కోసం ఈ ప్లాన్. ఇది ఒకేసారి 5జీబీ డేటా టాప్-అప్, 90 రోజుల జియోహాట్‌స్టార్‌ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ సేవలు లేవు. ఇది స్ట్రీమింగ్ కోసం డేటా బూస్టర్‌గా మాత్రమే పనిచేస్తుంది.
  2. జియో క్రికెట్ డేటా ప్యాక్ (రూ. 195): ఈ ప్లాన్ ఒకేసారి 15జీబీ డేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్‌ యాక్సెస్‌ను అందిస్తుంది. రూ. 100 ప్లాన్ లాగే, ఇది వాయిస్, ఎస్ఎమ్ఎస్ లను మినహాయించి.. మెరుగైన నాణ్యతలో మ్యాచ్‌లను స్ట్రీమ్ చేయడానికి ఎక్కువ డేటాను అందిస్తుంది.
  3. జియో సమగ్ర ప్లాన్ (రూ. 949): ఈ ప్లాన్ డేటా, కాల్స్, వినోదాన్ని కవర్ చేస్తుంది. ఇది రోజుకు 2జీబీ 4జీ డేటా.. అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ.. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు, 84 రోజుల జియోహాట్‌స్టార్‌ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది జియో క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది.

జియో అధికారిక వెబ్‌సైట్‌లో మరింత సమాచారం పొందవచ్చు. మరింత కంటెంట్ కోసం వెతుకుతున్న వారికి, OTTplay కేవలం రూ. 149కి 37 OTT ప్లాట్‌ఫామ్‌లు మరియు 500+ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది - అపరిమిత వినోదం కోసం వీకెండ్‌కు అనువైనది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం