Ashwin Comments: మేం క్రికెటర్లం.. యాక్టర్లం కాదు.. సూపర్ స్టార్ కల్చర్ పై అశ్విన్ హాట్ కామెంట్స్
Ashwin Comments: భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్లు చేశాడు. తాము క్రికెటర్లమని యాక్టర్లం కాదని వ్యాఖ్యానించాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో సూపర్ స్టార్ కల్చర్ ను ఎంకరేజ్ చేయొద్దన్నాడు.

భారత క్రికెట్లో సూపర్ స్టార్ కల్చర్ పై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లు నటులు లేదా సూపర్ స్టార్లు కాదని తన హిందీ యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కీ బాత్’లో అశ్విన్ మాట్లాడాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు మరో సెంచరీ సాధిస్తే అది చాలా సాధారణ విషయమని అతనన్నాడు.
సూపర్ స్టార్లు కాదు
‘‘భారత క్రికెట్లో విషయాలను నార్మల్ గా చూడటం ఎంతో ముఖ్యం. భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్ డామ్, సూపర్ సెలబ్రిటీస్ ను ఎంకరేజ్ చేయొద్దు. ముందుకు సాగుతున్నా కొద్దీ అన్ని నార్మల్ గా ఉండాలి. మేం క్రికెట్లరం. యాక్టర్లు లేదా సూపర్ స్టార్లం కాదు. మేం క్రీడాకారులం. సామాన్యుల్లాగే ఉండాలి. అందరిలో కలిసిపోవాలి’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
కోహ్లి, రోహిత్ లా
ఎంతో సాధించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు మరో సెంచరీ సాధించడం చాలా సాధారణ విషయమని అశ్విన్ అన్నాడు. ‘‘ఉదాహరణకు కోహ్లి లేదా రోహిత్ ఎంతో సాధించారు. అలాంటి ఆటగాళ్లు మరో సెంచరీ కొడితే అదెమంతా పెద్ద ఘనత కాదు. అది చాలా సాధారణ విషయం. ఈ అచీవ్ మెంట్స్ కంటే కూడా మన గోల్స్ పెద్దగా ఉండాలి’’ అని అశ్విన్ చెప్పాడు.
అయిదుగురు స్పిన్నర్లా?
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా అయిదుగురు స్పిన్నర్లకు ఎంపిక చేయడంపై అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘దుబాయ్ లో అయిదుగురు స్పిన్నర్లా? నాకు తెలియదు. ఇద్దరు కాకపోతే ఒక స్పిన్నర్ ను ఆడిస్తారనుకున్నా. హార్దిక్ తో పాటు ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్లు అక్షర్, జడేజా ఉన్నారు’’ అని అశ్విన్ తెలిపాడు.
సంబంధిత కథనం