India vs England 2nd odi: హిట్ మ్యాన్ రోహిత్ బాదుడుకు ఫ్లడ్ లైట్ బ్రేక్.. ఆగిన ఆట
India vs England 2nd odi: ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ హిటింగ్ కు ఫ్లడ్ లైట్స్ బ్రేక్ వేశాయి. లైట్లు ఆగిపోవడంతో ఆట ఆగింది.
రోహిత్ జోరు
వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ జోరందుకున్నట్లే కనిపిస్తున్నాడు. కటక్ లోని బారాబతి స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 9) ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో హిట్ మ్యాన్ హిట్టింగ్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. సిక్సర్లు బాదుతున్నాడు. మంచి రిథమ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఓ వైపు ఉన్న ఫ్లడ్ లైట్స్ ఆఫ్ కావడంతో ఆటకు బ్రేక్ వచ్చింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 304 పరుగులకు ఆలౌటైంది.
ఫ్లడ్ లైట్స్ ఆఫ్
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత్ ఛేదనలో ఫ్లడ్ లైట్స్ ప్రాబ్లం గా మారాయి. స్టేడియంలో ఉన్న ఆరు ఫ్లడ్ లైట్స్ టవర్లలో ఒకటి పూర్తిగా ఫెయిల్ అయింది. ఛేజింగ్ లో టీమ్ఇండియా 6 ఓవర్లో 47/0 తో ఉన్న సమయంలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఒక బాల్ పడగానే మళ్లీ లైట్స్ ఆఫ్ అయ్యాయి. దీంతో ప్లేయర్లు స్టేడియం బయటకు వెళ్లారు.
హిట్ మ్యాన్ సిక్సర్లు
వరుస ఫెయిల్యుర్ నుంచి బయట పడాలనే పట్టుదలతో ఈ ఛేదనను హిట్ మ్యాన్ ప్రారంభించాడు. అట్కిన్సన్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ తో కొట్టిన సిక్సర్.. ఆ వెంటనే మహ్మూద్ బౌలింగ్ లో లాఫ్టెడ్ షాట్ తో కవర్స్ దిశగా కొట్టిన సిక్సర్ ఆకట్టుకున్నాయి. మహ్మూద్ వేసిన మరో ఓవర్లోనే రోహిత్ బంతిని స్టాండ్స్ లో పడేశాడు. ఆట ఆగే సమయానికి రోహిత్ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం