రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో రాజస్థాన్ చిత్తుగా ఓడింది.
కాగా ఈ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ టైమ్‌లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. పదకొండో ఓవర్‌లో రియాన్ పరాగ్ బౌలింగ్ చేస్తోండగా ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్‌ను హగ్ చేసుకున్నాడు. సెక్యూరిటీ వచ్చి అభిమానిని మైదానంలో నుంచి తీసుకెళ్లారు.
రియాన్ పరాగ్ కాళ్లను అభిమాని మొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియాన్ పరాగ్ ఏం సాధించాడని ఫ్యాన్ అతడి కాళ్లపై పడ్డాడని నెటిజన్లు ట్రోల్ చేస్తోన్నారు. అభిమానికి పదివేలు డబ్బులు ఇచ్చి రియాన్ పరాగ్ చేసిన స్టాంట్ ఇదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పీఆర్ స్ట్రాటజీ సినిమాల్లోనే కాదు క్రికెట్‌లో కూడా మొదలైందని అంటున్నారు. రియాన్ పరాగ్... కోహ్లి, ధోనీ, రోహిత్‌లా లెజెండరీ క్రికెటర్ కాదంటూ చెబుతోన్నారు. రియాన్ పరాగ్‌ను ట్రోల్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
మరికొందరు మాత్రం రియాన్ పరాగ్‌ను వెనకేసుకొస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రమైన అస్సాం నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా రియాన్ పరాగ్ నిలిచాడని, ఎంతో టాలెంటెడ్ క్రికెటర్ అని చెబుతోన్నారు.
బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమి పాలైంది. కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మెయిన్ అలీ ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 151 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్. ధృవ్ జురేల్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే కోల్‌కతా ఛేదించింది. 61 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 97 పరుగులు చేసిన డికాక్ కోల్‌కతాకు అద్భత విజయం అధించాడు.
ఈ మ్యాచ్‌లో 15 బాల్స్‌లో మూడు సిక్సర్లతో రియాన్ పరాగ్ 25 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
సంబంధిత కథనం